హీరో నాగశౌర్య ఎన్ని కోట్లు కట్నంగా తీసకున్నాడో తెలుసా..? సోషల్ మీడియాల్ వైరల్ అవుతున్నన్యూస్.

First Published | Nov 24, 2022, 4:30 PM IST

రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు అయ్యాడు యంగ్ టాలీవుడ్ హీరో నాగశౌర్య. బెంగళూరుకు చెందిన అనుష ను ప్రేమించి పెళ్ళాడిన నాగశౌర్య పెద్ద మొత్తంలో డౌరీ తీసుకున్నాడటని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?
 

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య  బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి రీసెంట్గా ఒక ఇంటివాడు అయ్యాడు. చాలా కాలంగా బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని ప్రేమిస్తున్నశౌర్య... ఎట్టకేలకు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష ఒక బిజినెస్ విమెన్. ఇంటీరియర్ డిజైనర్ గా టాప్ పొజిషన్ లో ఉంది ఆమె. అంతే కాదు ఈరంగంలో ఎన్నో అవార్డును సైతం ఆమె అందుకుంది. 

అయితె కొంత కాలం క్రితం తాను ప్రేమలో ఉన్నానని ఒప్పుకున్న నాగశౌైర్య  అమ్మాయి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక డైరెక్ట్ గా పెళ్లి వరకూ వచ్చాక రివిల్ చేసేశాడు శౌర్య. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నప్పటికీ... ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. 
 


పెళ్లి ప్రశాంతంగా బెంగళూరులో చేసుకున్నారు ఈజంట. ఇక ఈపెళ్లిని ఘనంగా నిర్వహిచారు అనుష తరుపువారు. అక్కడ మర్యాధలతో పాటు.. భోజనాలు కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. రాజమహాల్ లో .. రాజుల వింధును తలపిస్తూ.. అన్ని వెరైటీలతో పెద్ద కంచంలో.. డిఫరెంట్ గా బోజనాలుప్లాన్ చేశారు. ఇక మండపం, పెళ్ళి గురించి చెప్పనక్కరక్లేదు. 

Naga Shaurya

నాగశౌర్య పెళ్ళి ఇంత ఘనంగా జరగడంతో.. ఆయన అత్తగారి తరపువారికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంటుందో అని అనుకుంటున్నారు యంగ్ హీరో ఫ్యాన్స్. అంతే కాదు  మరోవైపు, నాగశౌర్యకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నాగశౌర్య ఎంత కట్నం తీసకుని ఉంటాడు అని అంతా ఇంట్రెస్టింగ్ గా డిస్కర్షన్స్ చేసుకుంటున్నారు. 
 

Naga Shaurya

యంగ్ హీరోకు మామగారు ఎంత ఇచ్చారు? ఏం ఆస్తులు ఇచ్చారు? అనేదే హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడు నడుస్తున్ చర్చల ప్రకారం దాదాపు  40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కట్నం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు స్వతహాగా బిజినెస్ విమెన్ అయిన  అనూష పేరు మీద కూడా చాలా ఆస్తులు ఉన్నాయట. 

నాగ శౌర్య - 31

అంతే కాదు వారి కుటుంబం మొదటి నుంచి బాగా కలిగినవారు అవ్వడం.. వేల కోట్ల బిజినెస్ లు ఉండటంతో.. నాగశౌర్య బూరెల బుట్టల పడ్డాడంటున్నారు సోషల్ మీడియా జనాలు. వారి ఆస్తుల్లో చాలా వాటిని నాగశౌర్య పేరు మీద రాశారట. మరోవైపు, ఇది ప్రేమ వివాహం కాబట్టి కట్నం తీసుకోకపోయుండొచ్చని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ట్రెండ్ అవుతుంది ఈ న్యూస్. ఇక నాగశౌర్య వరుస సినిమాలు ప్లాప్ ల బాట పడుతున్నాయి. అయినా సరే పట్టు వదలకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం 3 సినిమాలు సెట్టస్ మీద ఉన్నాయి. 

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో పాటు.. నారీ నారీ నడుమ మురారీ, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు చేస్తున్నాడు నాగశౌర్య. రీసెంట్ గా రెండు రోజుల్లో పెళ్ళి ఉంది అనగా.. సడెన్ గా అస్వస్థతకుగురయ్యాడు శౌర్య. కాని వెంటనే కోలుకున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం చేసిన వర్కౌట్స్ మూలంగా తరచూ అనారోగ్యానికి గురౌతునట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!