పరశురామ్‌ కొంప ముంచిన సర్కారు వారి పాట... మహేష్ తో వెళ్లినందుకు ఆ హీరో గుర్రు!

First Published | Jul 22, 2022, 8:25 PM IST

హిట్ కొట్టినా ఏడాది గ్యాప్ తప్పేట్లు లేదు. దర్శకుడు పరుశురాం చేతిలో ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. నాగ చైతన్యతో మూవీ అనుమానమే అన్నట్లు ఉంది. సర్కారు వారి పాట పరుశురాం ని దెబ్బతీసిందని అంటున్నారు.

దర్శకుడు పరుశురాం(Parashuram) కెరీర్ పడుతూ లేస్తూ వస్తుంది. ఒక్క హిట్ పడితే వెంటనే ప్లాప్స్ ఇవ్వడం పరుశురాం కి అలవాటు. గీత గోవిందం పరుశురాం ఇమేజ్ భారీగా పెంచింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ నేపథ్యంలో ఏకంగా మహేష్ ఆయనకు ఆఫర్ ఇచ్చాడు. దీనితో నాగ చైతన్య ప్రాజెక్ట్ పక్కన పెట్టి మహేష్ తో సర్కారు వారి పాట మూవీ చేశారు. 
 

మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ దక్కించుకుంది. విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినప్పటికీ మహేష్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. మహేష్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయడంలో పరుశురాం చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక సర్కారు వారి పాట(Sarkaru Vaari paata) విడుదలై నెలలు గడుస్తున్న పరుశురాం కొత్త మూవీ ప్రకటన చేయలేదు. 
 



నిజానికి  పరుశురాం తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో చేయాలి. సర్కారు వారి పాట కంటే ముందు నాగ చైతన్య మూవీ చేయాల్సింది. మహేష్ నుండి బంపర్ ఆఫర్ రావడంతో నాగ చైతన్య సినిమా పరుశురాం పక్కన పెట్టాడట. ఆ విధంగా పరుశురాం, చైతూ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. 


ఇక థాంక్యూ మూవీ థియేటర్స్ లోకి తెచ్చిన చైతు ఇప్పుడిప్పుడే పరుశురాం మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లే మూడ్ లో లేడు. ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ అందుకు నిదర్శనం. పరుశురాంతో మూవీ గురించి మాట్లాడుతూ... ఒక లైన్ అనుకున్నాం, ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు అన్నాడు. 


నర్మగర్భంగా నాగ చైతన్య పరుశురాం ప్రాజెక్ట్ పట్ల అనాసక్తి చుపించాడనేది టాలీవుడ్ టాక్. కాబట్టి ఈ ప్రాజెక్ట్ రద్దు కావచ్చు. ఒకవేళ ఉన్నా ఆయన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని స్క్రిప్ట్ నచ్చితే ముందుకు వెళ్ళవచ్చు. అలా చూసినా కూడా పరుశురాం కనీసం ఏడాది సమయం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 


గతంలో తన ప్రాజెక్ట్ పక్కనపెట్టి మహేష్(Mahesh babu) తో మూవీ చేసిన పరుశురాం పై నాగ చైతన్య గుర్రుగా ఉన్నాడని, అందుకే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశాడు అంటున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. టూ టైర్ హీరోలు కూడా ఒకటికి రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకొని ఉన్నారు. కాబట్టి పరుశురాం కి నిరీక్షణ తప్పేలా లేదు. మొత్తంగా సర్కారు వారి పాట దర్శకుడు పరుశురాం కొంపముంచింది అంటున్నారు. 

Latest Videos

click me!