రోజురోజుకూ చిన్నపిల్లై పోతున్న మహేష్ భార్య నమ్రత... ఐదు పదుల వయసులో ఇదేం అందం!

Published : Sep 25, 2023, 01:18 PM IST

hero mahesh babu wife namrata shirodkar looks stunning in designer wear ksr నమ్రత శిరోద్కర్ అంతకంతకూ చిన్న పిల్లై పోతుంది. ఐదు పదుల వయసులో ఆమె గ్లామర్ మెస్మరైజ్ చేస్తుంది. నమ్రత లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
రోజురోజుకూ చిన్నపిల్లై పోతున్న మహేష్ భార్య నమ్రత... ఐదు పదుల వయసులో ఇదేం అందం!
Namrata Shirodkar

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ అందానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆమె వయసు తగ్గుతుందా అనే భావన కలుగుతుంది. నమ్రత ఇంత యంగ్ గా కనిపించడానికి కారణం క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. నమ్రత దినచర్యలో వ్యాయామం భాగంగా ఉంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా జిమ్ కి వెళతారు. ఆహార నియమాలు పాటిస్తారు. అన్నింటికీ మించి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. అదే ఆమె బ్యూటీ సీక్రెట్. 
 

25
Namrata Shirodkar

ముంబైలో పుట్టిన పెరిగిన ఒక స్టార్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్ద వారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఉంటారు. 

 

35
Namrata Shirodkar

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. 

45
Namrata Shirodkar

మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్యాపిల్లలతో ఫారిన్ ట్రిప్ కి చెక్కేస్తారు. 


 

55

దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం. 

click me!

Recommended Stories