మహేష్-నమ్రతలు టాలీవుడ్ బెస్ట్ కపుల్. అందులో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా, అవగాహనతో ఉండాలో వారిని చూసి నేర్చుకోవాలి. హైక్లాస్ ఫ్యామిలీస్ కి చెందిన మహేష్, నమ్రత వివాహ బంధం విషయంలో చాలా సాంప్రదాయంగా ఉంటారు. ఇక ఈ దంపతులు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారంటే... ప్రపంచంలో మరొక తల్లిదండ్రులు అంతగా ప్రేమించరేమో అన్నట్లు.