ఈ సంక్రాంతి సినిమా ప్రియులకు చాలా ఫేవరేట్. చిరంజీవి-బాలకృష్ణ నువ్వా నేనా అని తేల్చుకోనున్నారు. స్టార్ హీరోల పండగ పోరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో చాలా సార్లు చిరు, బాలయ్య పెద్ద పండగ వేళ ఒకరితో మరొకరు యుద్ధానికి దిగారు. చివరిగా 2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలయ్యాయి. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా విడుదలైన ఖైదీ నెంబర్ 150 పై చేయి సాధించింది. అయితే గౌతమీ పుత్ర శాతకర్ణి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.