మహేష్ బాబుకు ఒక కన్ను కనిపించదా? ఇదేం ట్విస్ట్ సామీ!

First Published | Jan 9, 2024, 8:01 AM IST

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం విడుదలకు సిద్ధం అవుతుంది. సంక్రాంతి బరిలో నిలుస్తుంది. కాగా మహేష్ బాబు పాత్ర గురించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 
 

Mahesh Babu

మహేష్ బాబు అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మాస్ హీరో. అలాగే ఆయన సినిమాలు క్లాస్ ఆడియన్స్ కూడా బాగా ఇష్టపడతారు. మహేష్ యూఎస్ మార్కెట్ లో కింగ్. టాక్ తో సంబంధం లేకుండా వన్ మిలియన్ డాలర్స్  అవలీలగా వసూలు అవుతాయి. 
 

Mahesh Babu

యూఎస్ లో అత్యధిక వన్ మిలియన్ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మహేష్ బాబు టాప్ లో ఉన్నారు. ఇక మహేష్ బాబు ఎంచుకునే స్క్రిప్ట్స్, క్యారెక్టర్స్ తన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఉంటాయి. మహేష్ బాబుని అందానికి చిరునామాగా చెప్పుకుంటారు. 


Mahesh Babu

అందుకే వీలైనంత హ్యాండ్సమ్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని మహేష్ కోరుకుంటాడు. ఫ్యాన్స్ ని మెప్పించాలి అనుకుంటాడు. మహేష్ బాబు డీ గ్లామర్ రోల్స్ ని ఇష్టపడరు. జనాలు తనను అలా అంగీకరించరు అనేది ఆయన ఆలోచన. సుకుమార్ పుష్ప సబ్జెక్టు మొదట మహేష్ బాబుకే చెప్పాడనే టాక్ ఉంది. 

పుష్ప మూవీలో హీరోది డీ గ్లామర్ రోల్. అలాగే గూని తో కూడిన బాడీ లాంగ్వేజ్. పుష్ప రోల్ తనకు సెట్ కాదని భావించిన మహేష్ రిజెక్ట్ చేశారంటారు. అయితే త్రివిక్రమ్ కోసం ఆయన అంగవైకల్యం ఉన్న రోల్ చేశాడనేది లేటెస్ట్ టాక్. 
 

Gunturkaaram

గుంటూరు కారం మూవీ ట్రైలర్ గమనించిన కొందరు అభిమానులు మహేష్ బాబుకి ఒక కన్ను కనిపించదు. మోనాక్యులర్ విజన్ తో బాధపడే వాడిగా మహేష్ క్యారెక్టర్ రూపొందించారని అంటున్నారు. అంటే మహేష్ పాత్రకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందట.

ఈ మధ్య స్టార్ హీరోల పాత్రలు లోపాలతో రాయడం దర్శకులకు ఫ్యాషన్ అయ్యింది. అది వర్క్ అవుట్ అవుతుంది కూడాను. రంగస్థలంలో రామ్ చరణ్, పుష్ప లో అల్లు అర్జున్, జై లవకుశ లో ఎన్టీఆర్ ఈ తరహా పాత్రలు చేశారు. మహేష్ కూడా గుంటూరు కారం చిత్రంలో కంటి చూపు సమస్య కలిగిన వాడిగా కనిపిస్తాడట. 

అయితే ఇది ఊహాగానం మాత్రమే. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. గుంటూరు కారం మూవీలో మహేష్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ నిర్మాతగా ఉన్నారు. 
 

Latest Videos

click me!