`దేవర`లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే.. అసలు స్టోరీ లీక్‌.. గ్లింప్స్ లో ఇవి గమనించారా?

Published : Jan 08, 2024, 09:47 PM IST

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` నుంచి గ్లింప్స్ వచ్చింది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సినిమా వస్తుండటంతో వారంతా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. తాజాగా గ్లింప్స్ వారిని హ్యాపీ చేసేలా ఉంది.   

PREV
110
`దేవర`లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే.. అసలు స్టోరీ లీక్‌.. గ్లింప్స్ లో ఇవి గమనించారా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. తాజాగా `దేవర` గ్లింప్స్ విడుదల కానుంది. ప్రారంభం నుంచి సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దానికి తగ్గట్టుగానే తాజాగా గ్లింప్స్ ఉంది. ఎన్టీఆర్‌ అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. 

210

అయితే దీనిపై కొంత నెగటివ్‌ స్పందన కూడా వస్తుంది. హైప్‌ ఇచ్చిన రేంజ్‌లో గ్లింప్స్ లేదని అంటున్నారు. నార్మల్‌గానే ఉందని, ఏదో ఊహించామని, కానీ సింపుల్‌గానే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్లింప్స్ ఓకే, కానీ అద్భుతం అనేలా లేదంటున్నారు కొందరు యాంటి ఫ్యాన్స్. దీంతో దీనికి వ్యూస్‌ పరంగానూ పెద్దగా లెక్కలు కనిపించడం లేదు. 

310

ఇదిలా ఉంటే గ్లింప్స్ ని గమనిస్తే చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ పాత్ర, `దేవర` కథకి సంబంధించిన హింట్‌ ఇచ్చినట్టుగా ఉంది. ఇక గ్లింప్స్ మాత్రం పూర్తిగా విజువల్‌ ట్రీట్‌లా ఉంది. విజువల్స్ సరికొత్తగా ఉన్నాయి. తెలుగు సినిమాల్లో గతంలో ఇలాంటి విజువల్స్ చూడలేదనేలా ఉంది. 

410

సినిమా చాలా వరకు రాత్రి సమయంలోనే సాగుతుందని గ్లింప్స్ ని బట్టి అర్థమవుతుంది. కేవలం గ్లింప్స్ లో ఆయా సీన్లు మాత్రమే చూపించారా? లేక సినిమా చాలా వరకు రాత్రి సమయంలోనే సాఉతుందా? అనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. అయితే జాన్వీ లుక్‌సమయంలోనూ నైట్‌ ఎఫెక్ట్ ఉంది. దీనికితోడు సినిమా కలర్‌ టోన్‌ బ్లాక్‌ అని తెలుస్తుంది. `సలార్‌`, `కేజీఎఫ్‌`లను ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. 
 

510

మరోవైపు `దేవర` గ్లింప్స్ లో యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. ఎన్టీఆర్‌ మార్క్ యాక్షన్‌ కనిపిస్తుంది. ఆయన ఇందులో లుంగీలో కనిపించడం కొత్తగా ఉంది. ఇంతటి ఊర మాస్‌ లుక్‌లో ఎన్టీఆర్‌ కనిపించి చాలా ఏళ్లు అవుతుంది. అది తారక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేలా ఉంది. ఊగిపోయేలా ఉంది. 
 

610

ఇక సముద్రపు ఒడ్డున యాక్షన్‌ సీన్లు, రాత్రి చంద్రబింబానికి రక్తపు చిందడం, చంద్రుడిని పరిపూర్ణం చేసినట్టుగా వచ్చే సీన్‌ పిచ్చెక్కించేలా ఉంది. ఆయా సీన్లు కనువిందు చేసేలా ఉన్నాయి. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. 

710

ఇక `దేవర` సినిమా మొత్తం సముద్రంలోనే సాగుతుందని దర్శకుడు తెలిపారు. తాజా గ్లింప్స్ లో కూడా అదే కనిపించింది. విడుదల చేసిన లుక్స్ అన్నింటిలోనూ సముద్రం కామన్‌ పాయింట్‌గా ఉంది. నీటిపై యుద్ధంలా కనిపించబోతుంది. 
 

810

ఇదిలా ఉంటే `దేవర` కథేంటి? ఇందులో ఎన్టీఆర్‌ పాత్రేంటి? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అందుతున్న లీకేజీ వార్తల ప్రకారం.. ఇందులో ఎన్టీఆర్‌ ఓడలను రక్షించే వ్యక్తిగా కనిపించబోతున్నారట. ఓడల్లో సరుకు రవాణా సాగుతుంది. దానికి నాయకుడిగా ఎన్టీఆర్‌ కనిపిస్తాడని గ్లింప్స్ ని బట్టి తెలుస్తుంది. 
 

910

అంతేకాదు స్టోరీకి సంబంధించిన ఓ లీకేజీ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. తండ్రి కట్టిన పోర్ట్ ని విలన్లు ఆక్రమిస్తే, దాన్ని సేవ్‌ చేసి, మళ్లీ తన కైవసం చేసుకునేందుకు ఎన్టీఆర్‌ పోరాడతాడని, అదే ఈ సినిమా కథ అని, దాని చుట్టూ తిరిగి సన్నివేశాల సమాహారమే `దేవర` సినిమా అని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

1010

ఇక ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న `దేవర` చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఏప్రిల్‌ 5న `దేవర` ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories