ఫ్యాన్స్ కి సితార సండే ట్రీట్... క్యూట్ ఫోటోలు షేర్ చేసిన మహేష్ డాటర్!

Published : Oct 29, 2023, 12:13 PM IST

సితార ఘట్టమనేని సోషల్ మీడియా ఫ్రీక్ అని చెప్పాలి. ఓ ఐదేళ్ల క్రితమే సోషల్ మీడియా అకౌంట్స్ స్టార్ట్ చేసింది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.   

PREV
17
ఫ్యాన్స్ కి సితార సండే ట్రీట్... క్యూట్ ఫోటోలు షేర్ చేసిన మహేష్ డాటర్!
Sitara Ghattamaneni

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఫ్యాన్స్ కి సండే ట్రీట్ ఇచ్చింది. తన క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. సితార నేచురల్ లుక్ మెస్మరైజ్ చేసేలా ఉంది. సితార ఫోటోలు చేసిన నెటిజెన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. 

27
Sitara Ghattamaneni

మహేష్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకుంది సితార. సోషల్ మీడియా ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. సితార పసిప్రాయంలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అందులో అవేర్నెస్ వీడియోలు షేర్ చేసేది. 

37
Sitara Ghattamaneni

ఇక తరచుగా డాన్స్ వీడియోలు, తన టూర్ డైరీస్ షేర్ చేస్తుంది. సితార ఫేమ్ చూసిన ప్రముఖ జ్యువెలరీ సంస్థ పీఎంజే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. సదరు సంస్థ సితార హోర్డింగ్స్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో ఏర్పాటు చేసింది. 

 

47
Sitara Ghattamaneni

11 ఏళ్లకే సితార అరుదైన గౌరవం అందుకుంది. పీఎంజే సంస్థ సితారకు రూ. 1 కోటి రెమ్యూనరేషన్ గా ఇచ్చారట. తన మొదటి సంపాదనను సితార ఛారిటీకి ఉపయోగించింది. దానగుణంలో సితార తండ్రికి తగ్గ కూతురు. మహేష్ బాబు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలైన చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నాడు. 

57
Sitara Ghattamaneni

సితార తన బర్త్ డే పేద విద్యార్థులతో జరుపుకుంది. అమ్మాయిలు స్కూల్ కి వెళ్లేందుకు వారికి సైకిల్స్ కొనిచ్చింది. అప్పుడప్పుడు సితార హాస్పిటల్స్ ని కూడా సందర్శిస్తూ ఉంటుంది. బాల్యంలోనే సితార గొప్ప లక్షణాలు పుణికిపుచ్చుకుంది. 
 

67

  సర్కారు వారి పాట మూవీలో 'పెన్నీ' సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు. 

 

77

ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు.  

click me!

Recommended Stories