100 కోట్ల ఇంట్లో ఒంటరిగా ఉంటోన్న స్టార్ హీరోయిన్, 400 కోట్ల ఆస్తి ఉన్నా.. బ్యాచిలర్ గా మిగిలిపోయిన తార ఎవరు..?

First Published | Jun 30, 2024, 7:37 AM IST

ఓ స్టార్ హీరోయిన్.. ఒంటరి హీరోయిన్.. 100 కోట్ల ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. 400 కోట్ల ఆస్తి ఉన్నా.. పెళ్ళి పెటాకులు లేకుండా అలా ఉండిపోయిన ఆ తార ఎవరో తెలుసా..? 

ఫిల్మ్ ఇండస్ట్రీలో లైఫ్ టైమ్ బ్యాచిలర్లు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లలో పెళ్ళి చేసుకోని సెలబ్రిటీలు లిస్ట్ చాలా పెద్దది. అంతే కాదు వారు స్టార్ డమ్ ను అనుభవించి.. కోట్లకు కోట్లు సంపాదించి.. కావలిసిన జీవితాన్ని చూస్తున్నారు. కాని ఫ్యామిలీ లైఫ్ ను మాతరం మిస్ అవుతున్నారు. ఈక్రమంలో.. భారీగా ఆస్తులు కూడబెట్టిన సీనియర్ బ్యాచిలర్ హీరోయిన్ గురించి ఇఫ్పుడు చూద్దాం. 

30 వేల కోట్ల ఆస్తి.. రజినీకాంత్ సినిమాలతో భారీగా లాభం.. దేశంలోనే రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా...?

రేఖ.. ఈ పేరు తెలియని హిందీవారు ఉండరు.  తెలుగువారికి కూడా పరిచయమే కాని.. ఈతరం వారికి ఆమె పెద్దగా తెలియక పోవచ్చు. సౌత్ నుంచి బాలీవుడ్ కు తరలి వెళ్ళి.. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రేఖ.  బాలీవుడ్  లో ఎన్నో సంచలనాలాలు సృష్టించింది రేఖ. ఆమె సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు అభిమానులు కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తేవారు. 

రవితేజ, నానితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..


హీరో డామినేషన్ ఉన్నఫిల్మ్ ఇండస్ట్రీలో.. రేఖ లాంటి హీరోయిన్ కు ఇంత ఫాలోయింగ్ అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్‌కు ఎంత క్రేజ్ ఉండేదో రేఖకు కూడా అదే క్రేజ్ ఉండేది. అసలు ఆమె అందానికి ఇండియాలోనే ఏ ఇండస్ట్రీలో కూడా  పోటీ లేదనేది అప్పట్లో బాగాప్రచారంలో ఉంది. 
 

హీనా ఖాన్ నుంచి గౌతమి, మనీషా కొయిరాలా వరకు..! క్యాన్సర్‌ తో పోరాడిన హీరోయిన్లు ఎవరంటే..?

రేఖా అంటే అప్పట్లో మామూలు క్రేజ్ కాదు. ఆమె ఒక్క సారి కనిపిస్తే చాలు అనుకునే అభిమానులు ఉన్నారు ఆరోజుల్లో.. ఇక సెలబ్రిటీలు కూడా రేఖ ను చూడటానికి పోటీపడేవారట. ఆమె డేట్స్ దొరికితే బాగుండి అని ఎదరు చూసే హీరోలు కూడా లేకపోలేదు. అంత పాపులారిటీని సాధించుకుంది  ఈ బ్యూటీ. అయితే ఇంత స్టార్ గా ఎదిగిన ఆమె.. సౌత్ ఇండియాన్ కావడం..అదికూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడం విశేషం. 

పెళ్ళై వారం కాలేదు.. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయింది..? హాస్పిటల్ లో కనిపించిన కొత్త జంట..?
 

రేఖ ఎవరో కాదు... పాతతరం  తమిళ స్టార్ హీరో జెమినీ గణేషన్ కూతురు. తెలుగు నటి పుష్పవల్లి కూతురు.  మహానటి సావిత్రికి సవతి కూతురు రేఖ. వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, అందంతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్‌గా నిలిచిపోయింది. కాని ఆమె లైఫ్ టైమ్ బ్యాచిలర్ గానే మిగిలిపోయింది. 

వరుస సినిమాలు.. స్టార్ స్టేటస్.. కోట్ల ఆస్తి.. భారీగా  పారితోషికం.. బాలీవుడ్ లో క్రేజ్.. ఇవన్నీ రేఖ సొంత. కాని ఆమె మాత్రం సింగిల్ గానే మిగిలిపోయింది. లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ..హ్యాపీగా అలా ఉండిపోయింది. ఆనిర్ణయానికి కారణం ఏంటీ అంటే.. రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. కారణం ఏది అయినా.. రేఖ మాత్రం ఏడు పదులు దగ్గర పడుతున్నా అదే ఉత్సాహంతో వెలుగిపోతోంది. అంతే కాదు లైఫ్ టైమ్ బ్యాచిలర్ల లిస్ట్ నిలిచిపోయింది. 

ఇక ఆమె ఆస్తి  గురించి చూస్తే.. రేఖ ఆస్తి గట్టిగానే సంపాదించింది. ఆమె లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. దాదాపు 400 కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉందని బాలీవుడ్ టాక్. అంతే కాదు ముంబయ్ లోని కాస్ట్లీ ఏరియాలో బసేరా పేరుతో 100 కోట్లు విలువ చేసే బంగ్లాలో ఆమె నివసిస్తున్నారు. 100 కోట్ల బంగ్లలో ఒంటరి జీవితం గడుపుతోంది రేఖ. 

అంతే కాదు ఆమెకు కార్లంటే పిచ్చి..  రేఖ గ్యారేజీలో కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి. 6 కోట్లు విలువ జేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్‌తో పాటు రూ. 2.5 కోట్లు విలువ జేసే మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, ఆడి ఎ8, బిఎమ్‌డబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ముంబయ్ రోడ్లపై తనకిష్టమైన కార్లలో రాయల్ గా వెళ్తుంటుంది రేఖ. 
 

ఇప్పటికి ఏక్కడికైనా వెళ్తే.. అందంగా తీర్చిదిద్దిన బొమ్మలా వస్తుంది రేఖ. నిండుగా పట్టుచీరకట్టుకని.. థిక్ మేకప్ లో.. కాస్ట్లీ జ్యూవల్లరీతో దర్శనం ఇస్తుంది. ఇక రేఖ బాలీవుడ్ లో నడిపిన అఫైర్ల పై రకరకాల వాదనలు ఉన్ానయి.

అప్పట్లో ఆమె సీనియర్ జూనియర్ అని తేడాలేకుండా కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా లవ్ ట్రాక్ నడిపిందని అంటుంటారు. ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని. రకరకాల వార్తలు మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. 
 

Latest Videos

click me!