కూల్‌గా కనిపించే ప్రభాస్‌కు కోపం వస్తే చేసేది ఇదే.! అసలు విషయం చెప్పేసిన హీరో గోపిచంద్

Published : Jan 14, 2026, 07:41 PM IST

Prabhas: 'ది రాజా సాబ్' చిత్రంతో సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు హీరో ప్రభాస్. ఇదిలా ఉంటే.. ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ సీక్రెట్ ఒకటి బయటపెట్టాడు గోపిచంద్.. అదేంటంటే.? 

PREV
15
హీరో టూ పాన్ ఇండియా స్టార్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సాధించిన హీరో ప్రభాస్.. బాహుబలి 1 & 2 మూవీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే తన నటనకు గానూ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత వరుస అవకాశాలతో తక్కువ కాలంలోనే స్టార్ అయ్యాడు.

25
ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్..

కెరీర్ మొదటి నుంచి బాక్సాఫీస్ దగ్గర వరుస హిట్స్ సాధించి.. స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత తన సినిమాలన్నీంటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే సిద్దం చేస్తున్నాడు. ఇప్పుడు వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నాడు.

35
ప్రభాస్ గురించి వైరల్ న్యూస్..

ప్రభాస్ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అతడి ఫ్రెండ్, హీరో గోపీచంద్ బయటపెట్టాడు. అది చూశాక.. కూల్‌గా ఉండే ప్రభాస్ ఇలా కూడా చేస్తాడా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

45
ప్రభాస్ టాప్ సీక్రెట్..

ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ.. అందరితో కూల్‌గా ఉండే ప్రభాస్‌కు కోపం వస్తే.. తనను ఎవరూ ఫేస్ చేయలేరని స్నేహితుడు గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రభాస్‌కి సామాన్యంగా కోపం రాదని.. ఒకవేళ కోపం వస్తే మాత్రం గట్టిగా అందరినీ అక్కడ నుంచి బయటకు వెళ్లిపోమని చెప్పి అరుస్తాడని చెప్పాడు. ఆపై గదికి తలుపులు వేసుకుని సిగరెట్ తాగుతాడని గోపీచంద్ స్వయంగా చెప్పకుండా సింబల్ చూపించాడని అన్నాడు.

55
గతంలోనూ ఓ వీడియో వైరల్..

గతంలో ప్రభాస్ దమ్ము కొడుతున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సాహో ప్రమోషన్స్ సమయంలో తన అసిస్టెంట్‌కి సిగరెట్ ఇవ్వమని ప్రభాస్ సైగ చేసిన వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories