Ramabanam Movie Review
రామబాణం కథ చెప్పాలంటే చాలా సింపుల్. విలువలు, నియమాలతో బ్రతికే ఒక అందమైన ఉమ్మడి కుటుంబం. ఈ కుటుంబాన్ని విలన్ డిస్ట్రబ్ చేస్తాడు. అప్పుడు ఆ ఫ్యామిలీలో ఒకడైన హీరో రంగంలోకి దిగుతాడు. శత్రువుల ఆట కట్టిస్తాడు. ఇది ఏళ్లుగా చాలా మంది దర్శకులు వాడేసిన మాస్ కమర్షియల్ సబ్జెక్టు. శ్రీవాస్ ఇదే తరహా కథతో ఆడియెన్సుని మెప్పించే ప్రయత్నం చేశారు.
Ramabanam Movie Review
శ్రీవాస్ డెబ్యూ మూవీ లక్ష్యం సూపర్ హిట్. అందులో గోపీచంద్, జగపతిబాబు అన్నదమ్ములుగా నటించారు. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో తెరకెక్కిన లౌక్యం పర్లేదు అనిపించుకుంది. హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ మరోసారి కలిశారు. అయితే ఒక తరహా ఫార్ములా ఒకసారి వర్క్ అవుట్ అయ్యిందని ప్రతిసారి కాదు. కథ, కథనాల విషయంలో అప్డేట్ కాకపోతే కష్టం.
Ramabanam Movie Review
దర్శకుడు శ్రీవాస్ రెండు దశాబ్దాల క్రితం హిట్ సబ్జెక్టునే ఇప్పటికీ నమ్ముకున్నారనిపిస్తుంది. రామబాణం అలాంటి చిత్రమే అని ప్రేక్షకుల అభిప్రాయం. అవుట్ డేటెడ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటున్నారు. ఏ మాత్రం కొత్తదనం లేని కథ కథనాలతో రామబాణం తెరకెక్కిందన్న మాట వినిపిస్తోంది.
Ramabanam Movie Review
యాక్షన్, ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ వంటి కమర్షియల్ అంశాలు జొప్పించి రామబాణం తెరకెక్కింది. అయితే అవేమీ వర్క్ అవుట్ కాలేదంటున్నారు. కామెడీ అక్కడక్కడా పర్లేదు అనిపించిందట. కొన్ని చోట్ల విసిగించింది అంటున్నారు. హీరోయిన్ తో కెమిస్ట్రీ కూడా అంతంత మాత్రమే.
Ramabanam Movie Review
గోపీచంద్ యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ వన్ లైనర్స్ ఓ వర్గాన్ని మెప్పించే అవకాశం కలదు. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు నిరాశ తప్పదంటున్నారు. దర్శకుడు శ్రీవాస్ మరోసారి ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయారన్నది ఆడియన్స్ అభిప్రాయం.
జగపతిబాబు, కుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిషోర్, సచిన్ ఖేడేకర్, సప్తగిరి వంటి భారీ స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించారు. వారిని పూర్తి స్థాయిలో దర్శకుడు వాడుకోలేదంటున్నారు. డింపుల్ హయాతి గ్లామర్ పరంగా ఓకే అంటున్నారు. మొత్తంగా రామబాణం గురితప్పింది మాట వినిపిస్తోంది. గోపీచంద్ కి ఈ మూవీ ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి.