Intinti Gruhalakshmi: సంజయ్ భరతం పట్టిన దివ్య.. జైలు పాలైన నందు!

Published : May 05, 2023, 08:45 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో టాప్ సీరియల్స్  సరసన స్థానం సంపాదించుకుంటుంది. కూతురి భవిష్యత్తు బాగోక పోయినా ఏమి చేయలేక తపన పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Intinti Gruhalakshmi: సంజయ్ భరతం పట్టిన దివ్య.. జైలు పాలైన నందు!

 ఎపిసోడ్ ప్రారంభంలో ఏం చేసుకుంటావో చేసుకో తలుపు తీయను అని ఛాలెంజ్ చేస్తాడు నందు. ఇదే ఇంట్లో అడుగు పెట్టి తీరుతాను ఇది నా చాలెంజ్ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది లాస్య. మరోవైపు కాలు నొప్పి నటిస్తూ బసవయ్యని తీసుకుని కిందికి వస్తుంది రాజ్యలక్ష్మి. కిందికి ఎందుకు వచ్చావు అంటూ మందలిస్తాడు విక్రమ్. 
 

29

దివ్యని పిలిచి నా ధ్యాస అంతా నీ మీదే నేను మీ పాలిట విలన్ లాగా మారాను. మీ శోభనానికి అడ్డుపడుతున్నాను అంటూ తెగ నటిస్తుంది. కోరుకున్న పిల్లనిచ్చి పెళ్లి చేసావు ఇంతకన్నా ఏం కావాలి అంటాడు విక్రమ్. అంతే చేశాను అంతకుమించి ఏమీ చేయలేదు  అందుకే పంతులు గారిని రమ్మన్నాను మీ శోభనానికి ముహూర్తం పెట్టడానికి అంటుంది రాజ్యలక్ష్మి. 
 

39

అప్పుడే వచ్చిన పంతులుగారు మీ  కంగారికి తగినట్లుగానే ఈరోజు సాయంత్రమే ముహూర్తం చాలా బాగుంది అని చెబుతారు. మరోవైపు  ఇప్పటికైనా లాస్య బాధ తప్పింది అంటాడు నందు. అంతు చూస్తాను అని వెళ్ళింది ఏం చేస్తుందో ఏమో అంటుంది అనసూయ. అదేం చేస్తుంది చూస్తూ ఉండండి తనే వచ్చి కాళ్లు పట్టుకుంటుంది అయినా క్షమించేది లేదు ఇకపై మా ఇద్దరి మధ్యన ఉన్న బంధం ముగిసిపోయినట్లే అంటాడు నందు.
 

49

 దివ్య సంగతి తలుచుకుంటేనే భయంగా ఉంది తను అక్కడ పాము నీడలో బ్రతుకుతోంది ముందు ముందు ఎన్ని ఇబ్బందులు పడుతుందో అంటూ భయపడుతుంది తులసి. నీ పరిస్థితి వేరు తన పరిస్థితి వేరు నీ భర్త నిన్ను చూసుకునేవాడు కాదు కానీ దాని భర్త దానిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అంటాడు నందు. అప్పుడే ప్రియ తనకి పెళ్లి సమయంలో ప్రియా హెచ్చరించిన విషయం కూడా చెప్తాడు.
 

59

ఆ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు అంటుంది తులసి. తెలుసుకొని ఏం చేస్తావు నాలాగా బాధపడటం తప్పితే అంటాడు నందు. కాలమే ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి అంటుంది తులసి. మరోవైపు హాస్పిటల్ కి వెళ్తుంటే చీపురుతో ఎదురొచ్చిందని ప్రియ మీద కోపంతో చేయి లేపుతాడు సంజయ్. అది చూసిన దివ్య ఎందుకు చెయ్యెత్తుతున్నావు అంటూ నిలదీస్తుంది.
 

69

అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి వీడు మళ్ళీ దీనికి దొరికిపోయినట్లున్నాడు ఒక ఆట ఆడుకుంటుంది. ఈ టాపిక్ ని ఇక్కడితో ఆపకపోతే పెద్ద రేవల్యూషన్ తీసుకొచ్చేలాగా ఉంది అనుకుంటూ  సంజయ్.. నువ్వు తప్పు చేశావు ప్రియ ఎలా బాధపడుతుందో చూడు అంటూ చేసిన తప్పుకి ప్రియకి సారీ చెప్పమంటుంది రాజ్యలక్ష్మి. ఇంటి కోడలు ఏడిపిస్తే ఇంటికి అరిష్టం అంటూ విక్రమ్ కూడా తమ్ముడు ని మందలిస్తాడు.
 

79

ముభావంగా సారీ చెప్పి వెళ్ళిపోతుంటాడు సంజయ్. అలా కాదు ఎదురుగా వెళ్లి మనస్ఫూర్తిగా మరెప్పుడు ఇలా చేయనని చెప్పు అంటుంది  దివ్య. రాజ్యలక్ష్మి కూడా చెప్పటంతో మరెప్పుడూ నీ మీద చెయ్యి ఎత్తను అంటూ సారీ చెప్తాడు సంజయ్. ఇప్పుడు సారీ చెప్తారు కానీ తర్వాత నరకం చూపిస్తారు ఆ సంగతి దివ్యకి తెలియదు అని బాధపడుతుంది ప్రియ.
 

89

మరోవైపు జరిగిందంతా భాగ్యానికి చెప్తుంది లాస్య. రాజ్యలక్ష్మి గారు అంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు నాలాంటి మీడియేటర్ ని పెట్టుకోవచ్చు కదా మళ్లీ నాకు ఎక్కడ కమిషన్ ఇవ్వాలని కక్కుర్తి. ఇప్పుడు చూడు ఏమైందో అంటుంది భాగ్యం. ఎలా అయినా నందు చేత కాళ్లు పట్టుకునే లాగా చేస్తాను అంటుంది లాస్య. అవును మరి నువ్వు పెద్ద సత్యభామ వి బావగారు ఏమో  శ్రీకృష్ణుడు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది భాగ్యం.
 

99

 మరోవైపు ప్రియ దగ్గరికి వచ్చిన దివ్య నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకుంటున్నావని అర్థమవుతుంది నువ్వు సంతోషంగా లేవని కూడా అర్థం అవుతుంది అంటుంది. అన్నీ ఉన్న వాడికి పంచభక్ష పరమాన్నాలు సంతోషం. ఏమీ లేని వాడికి గంజినీళ్లు దొరికినా సంతోషమే. నా మటుకు నేను సంతోషంగానే ఉన్నాను అంటుంది ప్రియ. తరువాయి భాగంలో లాస్య నందు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో నందుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పోలీసులు.

click me!

Recommended Stories