రామబాణం ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్, శ్రీవాస్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టేనా..?

Published : May 05, 2023, 09:07 AM ISTUpdated : May 05, 2023, 09:13 AM IST

గోపీచంద్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లు గా .. శ్రీవాస్ దర్శకత్వం వహించిన యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం రామబాణం ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ కు ముందే  యూఎస్ లో ప్రీమియర్స్ షోలు పడ్డాయి. ఈ సినిమా చేసిన ఫ్యాన్స్ ట్విట్టర్ లో తమ అభిప్రయాలు వెల్లడించారు మరి రామబాణం మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.  

PREV
17
రామబాణం ట్విట్టర్ రివ్యూ..  గోపీచంద్, శ్రీవాస్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టేనా..?

రామబాణం సినిమాలో  గోపీచంద్, డింపుల్ తో పాటు గా.. నాజర్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, సప్తగిరి, అలీ, రాజా రవీంద్ర లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించారు.  మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా... నిర్మాతలు టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మించారు. 
 

27

చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్  దగ్గర బోల్తా కొడుతూ వస్తోంది. చివరకు మారుతీ లాంటిమినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ కూడా గోపీచంద్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. ఇక గతంలో గోపీచంద్ కు రెండు హిట్లు అందించిన శ్రీవాస్ డైరెక్షన్ లో రామబాణం సినిమా తెరకెక్కింది. మరి ఈసారైనా గోపీచంద్ ఆడియన్స్ ను మెప్పించాడా..? 

37

సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సినిమా బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ అంటూ... కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. శ్రీవాసు మళ్లీ సాధించాడంటున్నారు ట్విట్టర్ జనాలు. 

 

 

47

ఇక ఫస్ట్ హాఫ్ చూసిన జనాలు మాత్రం రొటీన్ కథ, అక్కడక్కడ కామెడీ సీన్లతో పర్వాలేదు అనిపించింది. మళ్లీ గోపీచంద్ మార్క్ సీన్స్ కనిపించాయి అంటున్నారు. అంతే కాదు ఇంట్రవెల్ ట్వీస్ట్ మాత్రం బాగుంది అంటున్నారు. ఇంత మంచి ట్విస్ట్ కు.. మంచి సెకండ్ హాఫ్ ఉంటే.. సినిమా కాస్త హిట్ అయితుంది అంటున్నారు. 

57

చాలా మంది సినిమా యావరేజ్ అంటున్నారు. సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఆశించిన విధంగా లేదు అని రివ్యూలు ఇస్తున్నారు. అక్కడక్కడ మాత్రం కొన్ని సన్నివేశాలు.. సినిమాపై పాజిటీవ్ గా అనిపించడం.. అంతలోనే నిరాశపరిచే విధంగా ఉన్నాయి అంటున్నారు ట్విట్టర్ జనాలు. 

67

ఇక ఈసినిమాలో కూడా గోపీచంద్ ప్రతీసినిమాలో లా.. కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందంటున్నారు. ప్రతీ ఒక్కరు తమ పరిదిమేర నటించినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం కష్టమే కాని.. యావరేజ్ గానో.. ఇంకా ఆడియన్స్ కనికరిస్తే.. హిట్ పడే అవకాశం ఉంది అంటున్నారు ట్విట్టర్ జనాలు. 

77

ఇక ఈరోజు నుంచి థియేటర్లలో సందడి చేయబోతుంది రామబాణం. మరి ఆడియన్స్ ను ఎంత వరకూ ఆకట్టుకుంటుంది. గోపీచంద్ కు ఈసారైనా హిట్ పడుతుందా...? శ్రీవాస్ తో హ్యాట్రిక్ కొడతాడా అనేది చూడాలి. ఈమూవీకి మాత్రం హిరోయిన్ డింపుల్ గ్లామర్ బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. 

click me!

Recommended Stories