హీరో ధనుష్ భార్య రెండో పెళ్ళి..? ఐశ్వర్య రజనీకాంత్‌కి కాబోయే వరుడు ఎవరంటే..?

First Published | Apr 14, 2024, 5:02 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గారాలకూతురు.. ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి చేసుకోబోతుందా..? ధనుష్ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఐశ్వర్య.. పెళ్లి చేసుకోబోయేది ఎవరిని..? 

Dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్.. ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పటికీ వీరు విడిపోయి విడివిడిగా ఉంటున్నారే తప్పా..విడాకులు తీసుకోలేదు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరితో పెద్దలు మాట్లాడి బ్రతిమలాడటంతో.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.  అయితే విడాకులుతీసుకోకపోయినా.. విడివిడిగా ఎవరి బ్రతకువారు బ్రతకాలని నిర్ణయించుకున్నారట. 

అయితే విడాకుల నిర్ణయం ఐశ్వర్య తీసుకున్నదే అని.. కాని  ధనుష్ కు ఇంకా తన భార్యపై ప్రేమ అలానే ఉందంటున్నారు నెటిజన్లు. ధనుష్ ఆ రకంగా సిగ్నల్స్ ఇస్తున్నా.. ఐశ్వర్య మాత్రంగట్టిగా డిసైడ్ అయినట్టుంది. ఏమాత్రం ఆలోచన మార్చుకునేలా కనిపించడంలేదు. తనకు ఒంటరి జీవితమే చాలా బాగుందంటోంది. ప్రస్తుతం హాయిగా బ్రతుకుతున్నాను అంటోంది ఐశ్వర్య. 


అయితే తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్య రజినీకాంత్ త్వరలో రెండో పెళ్ళి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పెద్దల మాట మీద విడాకులు వద్దు అనుకున్నా.. రెండో పెళ్ళి కోసం తాజాగా విడాకులకు అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఐశ్వర్య ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తోందని ఊహాగానలు చెన్నై సర్కిల్ లో గట్టిగా నడుస్తున్నాయి. ఈ ప్రచారానికి ఆధారాలు లేవు కాని.. ఫిల్మ్ సర్కిల్ లో మాత్రం గట్టిగా వనిపిస్తుంది ఈమాట. 

Director Actor Dhanushs new film D 50 update out

ఈ విషయంలో చాలా మంది చాలా రకాలుగా గుసగుసలాడుతున్నారు. ఇందులో నిజం లేదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఒంటరి జీవితం చాలా బాగుంది అన్న ఐశ్వర్య...మళ్ళీ పెళ్ళి చేసుకునే ఛాన్స్ లేదంటున్నారు. తమ పిల్లల కెరీర్ పై వారు దృష్టిపెడతారంటూ మరో మాట వినిపిస్తుంది. 

Aishwarya Rajinikanth Marriage

2004లో తన తల్లిదండ్రుల అంగీకారంతో  ధనుష్‌ని పెళ్లి చేసుకుంది ఐశ్వర్య రజినీకాంత్. వివాహానంతరం ఎంతో సంతోషంగా జీవించిన ఐశ్వర్య-ధనుష్ దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహానంతరం భర్త ధనుష్ ఎదుగుదలకు సహకరించిన ఐశ్వర్య.. ధనుష్ తో '3' చిత్రానికి కూడా దర్శకత్వం వహించింది. 

పెళ్లై పిల్లలు పుట్టి.. 18 ఏళ్ళు హ్యాపీగా ఉన్న వీరు.. విడాకులు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఐశ్వర్య విడాకులు కోరడానికి కారణం... ధనుష్ కొంతమంది హీరోయిన్స్ తో  సన్నిహితంగా ఉంటున్నాడని.. అందుకే ఆమె అతని నుంచి విడాకులు కోరుతున్నట్టు తెలుస్తోంది. 

Rajinikanth and Dhanush

అయితే వీరిద్దరిని మళ్లీ కలిపేందుకు ధనుష్ కుటుంబం, రజనీ తరపు వారు ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమయ్యాయి.  అయితే వీరి పిల్లలయిన లింగ మరియు యాత్ర ఇద్దరూ తల్లీ తండ్రుల దగ్గర నచ్చినట్టుగా ఉంటున్నారు. 

Latest Videos

click me!