తండ్రి వద్దకు చేరిన చిరంజీవి చిన్న మనవరాలు... ఆనందంలో కళ్యాణ్ దేవ్!

First Published | Feb 12, 2024, 6:25 PM IST


చిరంజీవి మనవరాళ్లలో ఒకరైన నవిష్క తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు చేరింది. ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆనందం వ్యక్తం చేశాడు. 
 

Kalyan Dev

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరు విడిపోయి రెండేళ్లు దాటిపోయింది. గతంలో కళ్యాణ్ దేవ్ మామ చిరంజీవి ఇంట్లోనే ఉండేవారు. చిరంజీవి అల్లుడు హోదాలో హీరో కూడా అయ్యాడు. 
 

కళ్యాణ్ దేవ్ ని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో ఆమెకు ఒక కుమార్తె ఉంది. కళ్యాణ్ దేవ్-శ్రీజలకు మరో అమ్మాయి జన్మించింది. పేరు నవిష్క. కాగా శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోయాక నవిష్క తల్లి వద్దే ఉంటుంది. దీంతో కళ్యాణ్ దేవ్ కూతురిని చాలా మిస్ అవుతున్నాడు. 


Sreeja Konidela

అప్పుడప్పుడు కూతురిని తలచుని ఎమోషనల్ పోస్ట్స్ పెడుతూ ఉంటాడు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నవిష్కను శ్రీజ తండ్రి వద్దకు పంపుతుంది. కూతురు తన వద్ద ఉన్న ప్రతి నిమిషం కళ్యాణ్ దేవ్ ఆస్వాదిస్తాడు. తన సంతోషం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తాడు. 

Kalyan Dev

కాగా కళ్యాణ్ దేవ్ బర్త్ డే నేపథ్యంలో నవిష్క తండ్రి వద్దకు వచ్చింది. కూతురితో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు కళ్యాణ్ దేవ్. తన రాకతో బర్త్ డే చాలా ప్రత్యేకంగా మారిందని ఎమోషనల్ అయ్యాడు. కేక్ కట్ చేసి కూతురితో ఆహ్లాదంగా గడిపాడు. 

Kalyan Dev

అయితే కళ్యాణ్ దేవ్ వద్ద నవిష్క తాత్కాలికంగానే ఉంటుంది. ఒకటి రెండు రోజులు ఉండి మరలా తల్లి శ్రీజ వద్దకు వెళ్ళిపోతుంది. కాగా శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడాకుల ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా వేదికగా పరోక్ష ఆరోపణలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 

Kalyan Dev

ఇక శ్రీజతో విడిపోయాక కళ్యాణ్ దేవ్ కెరీర్ కూడా ముగిసింది. ఆయన నటనకు దూరమయ్యాడు. విజేత చిత్రంతో వెండితెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్... సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించాడు. శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. 

Latest Videos

click me!