Latest Videos

నాగబాబును పిచ్చ కొట్టుడు కొట్టిన చిరంజీవి.. తమ్ముడు చేసిన తప్పేంటి?

First Published May 26, 2024, 2:19 PM IST

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తన తమ్ముళ్లను చిరంజీవి ప్రేమగా చూసుకుంటాడు. అయితే ఓ సందర్భంలో నాగబాబును చిరంజీవి కొట్టారట. 
 

నాగబాబును హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు. దాంతో నిర్మాతను చేశాడు. కానీ నాగబాబుకు కాలం కలిసి రాలేదు. చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. మరోవైపు గీతా ఆర్ట్స్ చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ నిర్మించి బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది. 
 

మరోవైపు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యారు. చిరంజీవి తమ్ముడు హోదాలో ఎంట్రీ ఇచ్చి, తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. నాగబాబు మాత్రం నటుడిగా సెటిల్ అయ్యాడు. 

సందర్భం వచ్చినప్పుడల్లా... చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్ళతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అయితే ఒకసారి నాగబాబును చిరంజీవి కొట్టాడట. బాల్యంలో జరిగిన ఈ ఘటనను చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అమ్మకు సహాయంగా అన్ని పనులు నేనే చేస్తూ ఉండేవాడిని. ఒక రోజు లాండ్రీ నుండి బట్టలు తేవాల్సి ఉంది. అదే సమయంలో మరొక పని కూడా పడింది. నేను బయటకు వెళుతున్నాను. లాండ్రీ దగ్గరకు వెళ్లి బట్టలు  తెమ్మని నాగబాబుకు చెప్పాను. 

నేను పని చూసుకుని ఇంటికి వచ్చాక.. బట్టలు తెచ్చావా అని నాగబాబును అడిగాను. లేదు అన్నాడు. ఎందుకు తేలేదని అడిగాను. నిద్రపోయాను అని సమాధానం చెప్పాడు. దాంతో నాకు కోపం వచ్చి నాగబాబు కొట్టేశాను. నాగబాబును కొట్టినందుకు అమ్మ నాపై కోప్పడింది. సాయంత్రం నాన్న వచ్చాక జరిగింది అంతా చెప్పాను. నాగబాబును నాన్న మందలించాడు. అప్పుడు నాకు సంతృప్తిగా అనిపించింది.. అని చిరంజీవి గతంలో జరిగిన ఆ సంఘటన గుర్తు చేసుకున్నాడు... 

click me!