నవ్వితే కొడతాడు, బాలయ్య వరస్ట్ బిహేవియర్ బయటపెట్టిన స్టార్ డైరెక్టర్!

Published : Mar 06, 2024, 12:24 PM ISTUpdated : Mar 06, 2024, 01:13 PM IST

హీరో బాలయ్య షూటింగ్ సెట్స్ లో దారుణంగా ప్రవర్తిస్తాడట. తన అసిస్టెంట్ కొట్టబోయడంటూ షాకింగ్ కామెంట్ చేశాడు.   

PREV
16
నవ్వితే కొడతాడు, బాలయ్య వరస్ట్ బిహేవియర్ బయటపెట్టిన స్టార్ డైరెక్టర్!

బాలకృష్ణ స్టార్ హీరో. అయితే ఆయన ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. పబ్లిక్ లో ఆయన అభిమానులను కొడతారు. సెట్స్ లో కూడా బాలకృష్ణ తన అసిస్టెంట్స్ ని కొడతాడనే వాదన ఉంది. తాజాగా దర్శకుడు కేఎస్ రవి కుమార్ బాలకృష్ణ గురించి మాట్లాడారు . 

26

రజినీకాంత్ హీరోగా బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించాడు దర్శకుడు కే ఎస్ రవికుమార్. బాలయ్యతో ఆయన రూలర్, జై  సింహ చిత్రాలు చేశారు. అయితే అవి రెండు డిజాస్టర్స్ అయ్యాయి. ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో వారిద్దరూ మరలా చిత్రం చేయలేదు. 

 

36

కాగా సెట్స్ లో బాలయ్య ఎలా ఉంటాడో తాజా ఇంటర్వ్యూలో కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు. నవ్వితే బాలయ్యకు నచ్చదు అట. ఆయన తన గురించే నవ్వుకుంటున్నారని అనుకుంటాడట. కోప్పడతాడట. కొట్టబోతాడట. తనకు ఎదురైన ఓ అనుభవాన్ని కేఎస్ రవికుమార్ వెల్లడించాడు. 

46

ఒక రోజు కేఎస్ రవికుమార్ అసిస్టెంట్ ఫ్యాన్ బాలకృష్ణ వైపు తిప్పాడట. దాంతో ఆయన విగ్ లేచిపోయిందట. అసిస్టెంట్ నవ్వాడట. అతన్ని బాలకృష్ణ కొట్టబోయాడట. మధ్యలో వెళ్లిన కేఎస్ రవికుమార్ అతను నా అసిస్టెంట్ వదిలేయండని రవికుమార్ చెప్పాడట. బాలకృష్ణను సంతృప్తి పరచడం కోసం అసిస్టెంట్ మీద రవికుమార్ అరిచాడట. 
 

56

బాలకృష్ణ సెట్స్ లో ఇలా ఉంటాడని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మధ్య బాలకృష్ణ మీద ఆరోపణలు ఎక్కువయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కొందరు నటీమణులు చేసిన కామెంట్స్ ఆయన గురించే అని ప్రచారం జరుగుతుంది. మద్యం తాగి రాత్రి వేళ ఇబ్బంది పెడతారంటూ కామెంట్స్ చేయగా, అది బాలకృష్ణే అంటున్నారు. 

 

66

ఇక బాలయ్య జనాలను కొట్టడం అయితే వెరీ కామన్. దీనికి సంబంధించిన వీడియోలు పలుమార్లు వైరల్ అయ్యాయి  పబ్లిక్ లో ఊరికే ఇరిటేట్ అయ్యే బాలయ్య పక్కనే ఉన్న వాళ్ళను కొడతాడు. ఇదే విషయాన్ని దర్శకుడు కేఎస్ రవికుమార్ మరోసారి ధృవీకరించారు. 

click me!

Recommended Stories