#NTR:మరో బాలీవుడ్ సినిమా సైన్ చేసిన ఎన్టీఆర్, అది కూడా సీక్వెలే

Published : Mar 06, 2024, 11:45 AM IST

. బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ YRF స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్నాడు. 

PREV
18
#NTR:మరో బాలీవుడ్ సినిమా సైన్ చేసిన ఎన్టీఆర్, అది కూడా సీక్వెలే

ఇప్పుడు మీడియా మొత్తం ఎన్టీఆర్ గురించే మాట్లాడుతోంది. యష్ రాజ్ బ్యానర్ లో ఎన్టీఆర్ చేసే సినిమానే ఇప్పుడు హాట్ టాపిక్. ఆ సినిమా అప్డేట్ రాగానే ఫ్యాన్స్ ఖుషీ అయ్యిపోతున్నారు. అదే సమయంలో మరో వార్త దావానలంలా వ్యాపించింది. మరో హిందీ సినిమాని ఎన్టీఆర్ కమిటయ్యారని, ఆ సినిమాలో ఎన్టీఆర్ సోలో హీరోగా కనిపిస్తాడంటున్నారు. దాంతో ఇంతకీ ఏ సినిమా ఎన్టీఆర్ కమిటయ్యారు... అనేది చర్చగా మారింది. ఇంతకీ ఏమిటా సినిమా?

28
NTR

తెలుగు,హిందీ స్టార్ హీరోలు  ఎన్టీఆర్‌ (NTR), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan ) కలిసి నటిస్తున్న చిత్రం వార్‌-2 (War2). ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. దీనిని అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌గా నటించనున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఎన్టీఆర్ చేయని పాత్ర. చాలా షేడ్స్ తో ఈ పాత్ర ఉండబోతోంది.  

38

గతంలో సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, షారుక్‌ ఖాన్‌లు ఏజెంట్‌ పాత్రలో నటించి మంచి సక్సెస్ ని అందుకున్నారు. వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్‌ పాత్ర ఉంటుందనే వార్త వైరల్‌ అవుతోంది. ‘‘ఒక మంచి కథతో హిందీ చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్‌ను పరిచయం చేసేందుకు ప్లాన్ సిద్ధంగా ఉంది. వార్‌-2తో బాలీవుడ్‌లో ఆయన ప్రయాణం ఆగిపోదు. ఇదే బ్యానర్ లో వచ్చే మరెన్నో చిత్రాల్లో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఇది దీర్ఘకాలిక ఒప్పందం. పరిశ్రమలో ఉన్న ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాలో భాగం అవుతున్నారు.  ’’ అని చిత్రటీమ్ కు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం.

48
NTR

‘వార్‌ 2’ కోసం ఎన్టీఆర్‌  వచ్చే నెలలోనే  సెట్లోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న చిత్రమే ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ వారంలో షూట్ ని ప్రారంభించనున్నారు. హృతిక్‌ రోషన్‌పై కీలక సన్నివేశాల్ని జపాన్‌లో తెరకెక్కిస్తారని సమాచారం. ఆ తర్వాత షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ రంగంలోకి దిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.  

58

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పోషించనున్న పాత్రపై పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇండియన్‌ రా ఏజెంట్‌ పాత్రలో ఆయన కనిపిస్తారని, ఆ పాత్ర భవిష్యత్తులో తరచూ తెరపై కనిపిస్తూనే ఉంటుందని, ఆ నేపథ్యంలో సోలోగా ఓ సినిమా కూడా రూపొందనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ సోలోగా కనిపించే ఆ చిత్రం మరేదో కాదని థూమ్ -4 అని తెలుస్తోంది. థూమ్ సీక్వెల్ లలో ఇప్పటికి చాలా మంది హీరోలు చేసారు. ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ కు వచ్చింది. ఎన్టీఆర్ తో మరో హీరో ఉన్నా..ఎన్టీఆర్ ప్రధాన పాత్ర అవుతారనేది నిజం. 
 

68

ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’(Devara) చిత్రంలో నటిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ‘దేవర పార్ట్‌ 1’ దసరా పండగకు విడుదల కానుంది. జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ నెగిటివ్ రోల్ ఉన్న  పాత్రని పోషిస్తున్నారు.
 

78

ఏదైమైనా YRF స్పై యూనివర్స్ లో సింగిల్ హీరో ఫిలిం ఎన్టీఆర్ కి ఉండబోతుందని వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బాలీవుడ్ లో చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. దేవర పాన్ ఇండియా తర్వాత పాపులారిటీ మరింత పెరుగుతుందని, ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

88
NTR

ఏదైమైనా ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కు నార్త్ లో కూడా ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ స్టార్స్ ఎందరో ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  దాంతో మొత్తానికి ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాగా వేసినట్లే . 

click me!

Recommended Stories