ఈ క్రమంలో వేణు స్వామి ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి నెట్టింట మరింతగా రచ్చే చేస్తుంది. ఇందులో ఆయన ఈ లిక్కర్ విషయాన్ని ప్రస్తావించారు. తాను చేసే పూజల్లో లిక్కర్, నాన్ వెజ్ వాడతానంటూ ఓపెన్‌గా చెబుతున్నాడు. నేను చేసే పూజల్లో.. నా వద్దకు పూజల కోసం వచ్చే వారికి వాటర్‌లో లిక్కర్ కలిపి ఇస్తాను. వేరే వాళ్లు నీళ్లు కలిపి ఇస్తారు, కానీ నేను మాత్రం లిక్కర్, నాన్ వెజ్ పెడతాను. నేను చేసే ప్రతి పూజా.. వామాచార, భగాలమ్మకి, రాధేశ్యామల, తార, చిన్నమస్తా ఇలా ప్రతి పూజకి లిక్కర్, నాన్ వెజ్ పెడతాను. నేనిచ్చే ప్రసాదం అదే. లిక్కర్ తాగే వాళ్లకి లిక్కర్ ఇస్తా, కూల్ డ్రింక్ తాగే వాళ్లకి కూల్ డ్రింగ్ ఇస్తా. డైరెక్ట్ గా అఫీషియల్‌గానే పెడతాను, దొంగచాటున ఏం పెట్టను` అంటూ వెల్లడించారు.