అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న మరో హీరోయిన్... చైతు మాదిరే అఖిల్ కూడా?

Published : Apr 22, 2024, 03:19 PM IST

అక్కినేని నాగార్జునకు కోడలిగా మరో హీరోయిన్ రానుందట. అఖిల్ పెళ్ళికి రంగం సిద్ధం అవుతుందట. త్వరలో అక్కినేని వారింట్లో పెళ్లి భాజా మోగనుందని అంటున్నారు.   

PREV
16
అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న మరో హీరోయిన్... చైతు మాదిరే అఖిల్ కూడా?
Samantha

అక్కినేని నాగార్జునకు పెద్దకోడలిగా సమంత అడుగుపెట్టింది. నాగ చైతన్య ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మొదట్లో సమంతను నాగార్జున అంగీకరించలేదనే వాదనలు వినిపించాయి. ఎట్టకేలకు కుటుంబ సభ్యులను ఒప్పించి సమంత-నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. 


 

26

అనూహ్యంగా నాగ చైతన్య-సమంత విడిపోయారు. నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం మనస్పర్థలు తలెత్తాయి. 2021లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. సమంత, నాగ చైతన్య అభిమానులను ఈ పరిణామం వేదనకు గురి చేసింది. వారిని కలపాలని ఎన్ని ప్రయత్నాలు జరిగినా కుదరలేదట. 

36
Akhil Akkineni


కాగా నాగార్జునకు రెండో కోడలిగా కూడా హీరోయినే రాబోతుంది అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ తో అఖిల్ రిలేషన్ లో ఉన్నాడట. సదరు హీరోయిన్-అఖిల్ పీకల్లోతు ప్రేమలో పడ్డారట. 

 

46
Akhil Akkineni

ఆమెను వివాహం చేసుకోవాలని అఖిల్ డిసైడ్ అయ్యాడట. ఈ విషయాన్ని కుటుంబ సబ్యులకు కూడా చెప్పాడట. నాగార్జున, అమల సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో అధికారికంగా రివీల్ చేస్తారట. అలాగే పెళ్లి ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. 

56
Akhil Akkineni

కాగా అఖిల్ కి 2016లో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కారణం ఏమిటో కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. మరలా అఖిల్ పెళ్లి ప్రయత్నం చేయలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాడు. 
 

66

ఇక అఖిల్ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. సాలిడ్ కమర్షియల్ హిట్ అయితే ఇంకా పడలేదు. అఖిల్ గత చిత్రం ఏజెంట్ దారుణ పరాజయం చవి చూసింది. అఖిల్ కి ఉన్న ఇమేజ్ కూడా డామేజ్ చేసింది. నెక్స్ట్ మూవీతో అయినా హిట్ కొట్టాలని అఖిల్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories