13కోట్ల విలువ చేసే కార్లు, ఖరీదైన ఇళ్ల స్థలాలు: బచ్చన్ ఫ్యామిలీ ఆస్తుల గురించి తెలిస్తే మైండ్ బ్లాకే

First Published Oct 13, 2020, 1:29 PM IST

అమితాబ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్. ఆయన దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలారు. 77ఏళ్ల అమితాబ్ కోసం పాత్రలు సృష్టించి సినిమాలు చేస్తున్నారు దర్శకులు. మరో ప్రక్క గొప్ప బుల్లితెర వ్యాఖ్యాతగా అమితాబ్ పేరు తెచ్చుకున్నారు. ఆయన బ్రాండ్ విలువ రీత్యా అనేక ప్రముఖ కంపెనీలకు ప్రచార కర్తగా ఉన్నాడు. మరి ఇన్ని రంగాలలో రాణిస్తున్న బచ్చన్ ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ కావలసిందే...

రాజ్యసభలోఎంపీగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో జయాబచ్చన్ తమ ఆస్తులకు సబంధించినవివరాలు వెల్లడించారు. దాని ప్రకారం స్థిరాస్థులు రూ.460 కోట్లు కాగా రూ.343 కోట్ల చరాస్తులుకలిగి ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం జయాబచ్చన్ కి 62కోట్లు విలువ చేసే బంగారం, నగలు ఉన్నాయట. ఇక అమితాబ్ కి చెందిన బంగారంవిలువ రూ. 36 కోట్లు అట.
undefined
అమితాబ్ బచ్చన్ కి ఉన్న లగ్జరీగడియారాలవిలువ రూ. 3.4కోట్లు కాగా, జయాబచ్చన్ కి చెందినగడియారాల విలువ రూ.51 లక్షలట. కేవలం అమితాబ్ వద్ద ఉన్న పెన్స్ విలువరూ.9 లక్షలు కావడంవిశేషం.
undefined
బచ్చన్ ఫ్యామిలీకి ఫ్రాన్స్ లో 3175 గజాల రెసిడెన్సియల్ ప్రాపర్టీ ఉంది. అలాగే నోయిడా, గాంధీ నగర్, ముంబై, గుర్గావ్, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాలలోస్థలాలు ఉన్నాయి.
undefined
బచ్చన్ ఫ్యామిలీకి ఫ్రాన్స్ లో 3175 గజాల రెసిడెన్సియల్ ప్రాపర్టీ ఉంది. అలాగే నోయిడా, గాంధీ నగర్, ముంబై, గుర్గావ్, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాలలోస్థలాలు ఉన్నాయి.
undefined
గత నెలలో అమితాబ్ మెర్సిడెస్ ఎస్ క్లాస్ కొన్నారు. ఇండియాలో కొత్తగా లాంఛ్ అయిన ఈ కార్ ధర రూ. 1.38 కోట్లు. ఇది అమితాబ్ పేరున రిజిస్టర్ అయ్యింది.
undefined
బాలీవుడ్ నిర్మాత విధు వినోద్ చోప్రా 2007లో రోల్స్ రాయిస్ కారును అమితాబ్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ కారు ధర రూ. 4.5 కోట్లు కావడం విశేషం. ఈ ఖరీదైన కారును అమితాబ్ మైసూర్ కి చెందిన రుమాన్ ఖాన్ అనే ఓ బడా వ్యాపారవేత్తకు గత ఏడాది మార్చ్ లో అమ్మివేశారట.
undefined
అలాగే లగ్జరీ సెగ్మెంట్ లో బెంట్లే ఆరంజ్ కారు కూడా అమితాబ్ కి ఉంది. దాని విలువ రూ. 3కోట్ల రూపాయలు. అలాగే రూ. 2.7 కోట్ల విలువైన మెర్సెడెజ్ బెంజ్ జి ఎల్ ఎస్ యూ వి ఉంది. అలాగే రూ. 1.7 కోట్ల విలువ చేసే బి ఎమ్ డబ్ల్యూ సిరిజ్ 760 ఎల్ ఐ ఆయన కలెక్షన్స్ ఉన్నాయి.
undefined
ఇక రూ. 1.5 కోట్ల విలువ చేసే టయోట లౌడ్ క్రూజర్, రూ. 1.2 కోట్ల విలువైన లేక్సస్, రూ. 1.05 కోట్ల విలువ చేసే పోర్షే కేమన్ ఎస్ వంటి ఖరీదైన కార్లను అమితాబ్ కొన్నారు. 43లక్షల విలువ చేసే రేంజ్ రోవర్, 40 లక్షల విలువైన మినీ కూపర్ ఎస్ వంటి అరుదైన కార్లకు అమితాబ్ యజమానిగా ఉన్నారు.
undefined
undefined
undefined
undefined
undefined
undefined
click me!