ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపించే కొద్దీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చిత్రాలు ఎక్కువవుతున్నాయి. ఆల్రెడీ మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో నేరుగా వైఎస్ జగన్ పాత్రని హైలైట్ చేస్తూ.. ఆయన చేసిన పాదయాత్ర, కేసులు ఎదుర్కొన్న విధానం లాంటి అంశాలని చూపించారు. మరోవైపు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కూడా జగన్ ని హైలైట్ చేస్తూ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాత్రలపై సెటైర్లు వేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.