లేత మనసులు చిత్రంలో తెలుగులో జమున, హరనాథ్ నటించారు. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో హీరోయిన్ జముననే.. హీరోగా జైశంకర్ చేసారు. జై శంకర్ కి అదే తొలి చిత్రం. సాంగ్ షూటింగ్ జరుగుతున్నపుడు.. జైశంకర్ గడ్డి వామి నుంచి దొర్లుకుంటూ వచ్చి కింద ఉన్న జమున పక్కన కూర్చోవాలి. రిహార్సల్స్ లో కరెక్ట్ గా చేసాడట. కానీ షూట్ చిత్రీకరిస్తున్నప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో ఏమో.. సరాసరి జమున తలపై పడిపోయారు.