HBD Nagarjuna: నాని, కార్తీ, విష్ణు... ఇతర హీరోలతో కెరీర్ లో నాగార్జున చేసిన 13 మల్టీస్టారర్స్...! 

First Published Aug 29, 2022, 1:48 PM IST

స్టార్ హీరోగా నాగార్జునలో ఉన్న ప్రత్యేకతలు మరో హీరోలో ఉండవేమో. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన విభిన్నమైన జోనర్స్ ట్రై చేశారు. అనేక ప్రయోగాలు చేశారు. నాగార్జున కెరీర్ బిగినింగ్ నుండి దాదాపు 13 మల్టీస్టారర్స్ చేశారు. 
 

HBD Nagarjuna


 నాగ చైతన్య, నాగేశ్వరరావుతో చేసిన చిత్రాలు కూడా కలుపుకుంటే ఈ లిస్ట్ ఇంకా పెద్దదే. ఫ్యామిలీ హీరోలను మినహాయించి నాగార్జున చేసిన మల్టీస్టారర్స్ ఇవే.
 

HBD Nagarjuna

 నాగార్జున తన రెండో చిత్రమే మల్టీస్టారర్ చేశారు. కెప్టెన్ నాగార్జున(1986) టైటిల్ తో విడుదలైన ఈ మూవీలో మరో హీరోగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. అయితే సింహభాగం నాగార్జునదే. రాజేంద్ర ప్రసాద్ తో ఆయన చేసిన మరో చిత్రం అరణ్య కాండ(1986). 
 

HBD Nagarjuna


సీనియర్ హీరో కృష్ణంరాజు తో సైతం రెండు మల్టీస్టారర్స్ నాగార్జున చేశారు. కిరాయి దాదా(1987) నేటి సిద్ధార్థ(1990) చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. 

HBD Nagarjuna

డైలాగ్ కింగ్ మోహన్ బాబు-నాగార్జున కాంబినేషన్ లో రెండు మల్టీస్టారర్స్ విడుదలయ్యాయి. ప్రేమ యుద్ధం(1990) మొదటి చిత్రం కాగా... చాలా గ్యాప్ తర్వాత  అధిపతి(2001) చిత్రాన్ని చేశారు.  
 

hbd nagarjuna

సూపర్ స్టార్ కృష్ణ-నాగార్జున కలిసి రెండు మల్టీస్టారర్స్ చేశారు. వారసుడు(1993), రాముడొచ్చాడు(1996) చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. రాముడొచ్చారు చిత్రంలో కృష్ణ గెస్ట్ రోల్ చేశారు.  
 

HBD Nagarjuna


నాగార్జున కెరీర్ లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో రావోయి చందమామ(1999) ఒకటి. ఈ మూవీలో జగపతి బాబు సెకండ్ హీరోగా కనిపించారు. అంజలా ఝవేరి హీరోయిన్. 

HBD Nagarjuna

మంచు విష్ణుతో సైతం నాగార్జున కలిసి నటించారు. కృష్ణార్జున(2008) చిత్రంలో నాగార్జున భగవంతుడు పాత్ర చేయడం విశేషం.

HBD Nagarjuna

కోలీవుడ్ హీరో కార్తీతో ఊపిరి(2016) చిత్రంలో నాగార్జున నటించారు. హాలీవుడ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున వీల్ చైర్ కి మాత్రమే పరిమితమయ్యే పేషెంట్ రోల్ చేశారు.

HBD Nagarjuna

 
నాగార్జున-నాని కాంబినేషన్ లో విడుదలైన చిత్రం దేవదాస్(2018). ఈ మూవీలో నాగార్జున డాన్ గా కనిపించి అలరించారు. ఇన్ని మల్టీస్టారర్స్ చేసిన నాగార్జున చాలా అరుదైన నటుడు అనడంలో సందేహం లేదు. 

click me!