Padma Vibhushan Chiranjeevi:'పద్మ విభూషణ్' వల్ల చిరంజీవికి కలిగే ప్రయోజనాలు, గౌరవాలు ఏంటి ?

Published : Jan 26, 2024, 03:00 PM IST

తెలుగు వారంతా గర్వపడే విధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ఇది.

PREV
16
Padma Vibhushan Chiranjeevi:'పద్మ విభూషణ్' వల్ల చిరంజీవికి కలిగే ప్రయోజనాలు, గౌరవాలు ఏంటి ?

తెలుగు వారంతా గర్వపడే విధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ఇది. తెలుగు సినీ రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ సేవలందిస్తున్న చిరంజీవికి తగిన గౌరవం ఇది. 

26

దీనితో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి.. అభిమానుల నుంచి చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవికి 2006లోనే పద్మభూషణ్ అవార్డు వరించింది. అయితే నేడు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండవ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 

36

అయితే పద్మ అవార్డులపై చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. పద్మ అవార్డులు అందుకున్న వారికీ నగదు బహుమానాలు, అనేక రాయతీలు దక్కుతాయని భవిస్తూ ఉంటారు. అయితే అలాంటిది ఏమీ ఉండదు. పద్మ అవార్డు అనేది కేవలం గౌరవం మాత్రమే. పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా దక్కే నగదు, ఇతర రాయతీలు ఏమీ ఉండవు. 

46

చాలా మంది అనుకుంటున్నట్లు రైళ్లలో, విమానాల్లో రాయతీలు ఉండవు. కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ తో దక్కిన గౌరవం పద్మ విభూషణ్ అవార్డు. పద్మ అవార్డు దక్కిన వారి రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంటుంది. 

56

రాష్ట్రపతి సంతకం ఉన్న సర్టిఫికెట్, ఒక పతకం అందజేస్తారు. వీరికి దేశమంతా గుర్తింపు, గౌరవం దక్కుతాయి అంతే. 2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చిరంజీవికి గౌరవ డాక్టరేట్ దక్కింది. 

 

66

1955 ఆగష్టు 22న మొగల్తూరులో జన్మించిన మెగాస్టార్ చిరంజీవి 1978లో పునాదిరాళ్ళు చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ చిత్రం చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పడం మాత్రమే కాలేదు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయేలా చేసింది. 

click me!

Recommended Stories