హీరో,కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్...నటుడిగా బాలు సూపర్ హిట్

First Published | Sep 25, 2020, 5:48 PM IST

బహుముఖ ప్రజ్ఞా శాలి అయిన బాలు నటుడిగా 70కి పైగా చిత్రాలలో నటించారు. కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన అనేక విభిన్న పాత్రలు చేయడం జరిగింది.

ఎస్పీ బాలసుబ్రమణ్యంను తెలుగు ప్రేక్షకులకు దగ్గిర చేసిన అంశం ఒక్క గానమే కాదు ఆయన నటన కూడా. ఎస్పీ బాలు ఓ గొప్ప నటుడు, కెరీర్లో70కి పైగా చిత్రాలలో నటించారు.1969లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ళ పంట చిత్రంలో బాలు చిన్న పాత్ర చేశారు.మహ్మద్బిన్ తుగ్లక్ మూవీలో రమా ప్రభ బర్త్ డే వేడుక సన్నివేశంలో బాలు కనిపిస్తారు.
1981లో వచ్చిన పక్కింటి అమ్మాయి మూవీలో బాలు...బాలరాజు అనేకొంచెం నిడివి కలిగిన పాత్ర చేయడం జరిగింది. అప్పటికే బాలు స్టార్ సింగర్ గా ఉన్నారు. ఆ మూవీలో బాలు కామెడీ పీక్స్ అని చెప్పాలి.వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమ మూవీలో బాలు కీలక రోల్ చేయగా, ఆ పాత్రకు ప్రశంశలు దక్కాయి.

1990లో బాలు కేలాడి కణ్మణిమూవీలో హీరోగా చేయడం విశేషం. ఆ మూవీలో రాధిక హీరోయిన్ గా చేసింది. తెలుగులో ఈ చిత్రం ఓ పాపా లాలీ పేరుతో విడుదలయ్యింది. ఈ మూవీలో బాలు గుక్క తిప్పుకోకుండా పాడిన 'మాటే రాని చిన్నదాని' పాట చాలా పాప్యులర్ అయ్యింది.
దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ప్రేమికుడు మూవీలో బాల సుబ్రహ్మణ్యం హీరో ప్రభుదేవా తండ్రి పాత్ర చేశారు. ప్రేమ కోసం కష్టాలు పడుతున్న కొడుకు కోసం తపించే తండ్రి పాత్రలో బాల సుబ్రహ్మణ్యం అద్బుతంగా నటించారు. ఆ మూవీలో బాలు అందమైన ప్రేమ రాణి సాంగ్ లో ప్రభుదేవాతో పాటు స్టెప్స్ వేయడం విశేషం.వెంకటేష్ హీరోగా వచ్చిన పవిత్ర బంధం మూవీలో పారిశ్రామిక వేత్తగా, తప్పుడు దారిలో వెళుతున్న కొడుకును సరిద్దిదే తండ్రిగా అద్భుత నటన కనబరిచారు. ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రంలో కూడా బాలు కీలక రోల్ చేయడం విశేషం.
వెంకటేష్ హీరోగా వచ్చిన పవిత్ర బంధం మూవీలో పారిశ్రామిక వేత్తగా, తప్పుడు దారిలో వెళుతున్న కొడుకును సరిద్దిదే తండ్రిగా అద్భుత నటన కనబరిచారు. ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రంలో కూడా బాలు కీలక రోల్ చేయడం విశేషం.
వృద్ధ దంపతుల కథలో నటుడు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం బాలు నటనా సామర్ధ్యానికి నిదర్శనం. వృద్దుడిగా, చిన్న పిల్లాడి మనస్థత్వం కలిగిన వాడిగా కామెడీ, ఎమోషన్స్ ఆయన పండించారు.
బాల సుబ్రహ్మణ్యం చివరిసారిగా నాగార్జున మరియు నాని కాంబినేషన్ లో వచ్చిన దేవ్ దాస్ మూవీలో కనిపించారు. చనిపోయేవరకు కూడా బాలు తన పాటలతో ప్రేక్షకులను అలరించారు.

Latest Videos

click me!