బాలు ఓ గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్...బాలయ్యకు కూడా డబ్బింగ్ చెప్పారు, ఆ చిత్రం ఏంటంటే..?

First Published Sep 25, 2020, 3:21 PM IST

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్పీ బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాలకు పనిచేశారు. ఇతర పరిశ్రమలకు చెందిన హీరోలు, నటులకు గాత్ర దానం చేశారు. అత్యధికంగా కమల్ నటించిన తెలుగు వర్షన్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన బాలు ఓ చిత్రంలో బాలయ్యకు కూడా డబ్బింగ్ చెప్పడం విశేషం. 
 

దాదాపు ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే ఎస్పీ బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా ఫేమస్. ఇతర పరిశ్రమలకు చెందిన అనేకమంది స్టార్ హీరోలకు బాలు డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా తమిళ డబ్బింగ్ చిత్రాలలోని హీరోల పాత్రలకు బాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది. నటుడు గాత్రానికి తగ్గట్టుగా పాటలు పాడే బాలు, హీరో బాడీలాంగ్వేజ్ కి సరిపోయేలా గాత్రం దానం చేశేవారు.
undefined
పరిశ్రమలో విశ్వ నటుడు కమల్ హాసన్ తో ప్రత్యేక అనుబంధం కలిగిన బాలు ఆయన నటించిన అనేక సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పారు. కమల్ నటించిన స్వాతిముత్యం, సాగర సంగమం సినిమాలు మినహాయిస్తే ప్రతి సినిమాకు బాలు కమల్ కి డబ్బింగ్ చెప్పారు. తమిళ వర్షన్ స్వాతిముత్యం కి బాలు, కమల్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం.
undefined
రుద్రవీణ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్ర చేసిన జెమినీ గణేశన్ కి బాలు డబ్బింగ్ చెప్పారు. ఇద్దరు, హరికృష్ణన్స్ అనే చిత్రాల కోసం మోహన్ లాల్ కి గాత్ర దానం చేశారు.
undefined
నితిన్ హీరోగాదర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించినశ్రీ ఆంజనేయం మూవీలో హనుమంతుడిగా చేసిన అర్జున్ కి బాలుగారు డబ్బింగ్ చెప్పారు. అన్నమయ్య సినిమాలోశ్రీవెంకటేశ్వరుడుపాత్ర చేసిన సుమన్ కి బాలు డబ్బింగ్ చెప్పారు.
undefined
రజినీకాంత్, జగపతి బాబు కలిసి చేసిన మల్టీస్టారర్కథానాయకుడు మూవీలో రజినీ కాంత్పాత్రకు బాలు డబ్బింగ్ చెప్పడం విశేషం. అలాగే స్లమ్డాగ్ మిలియనీర్తెలుగు వర్షన్ లో అనిల్ కపూర్ పాత్రకు బాలు డబ్బింగ్ చెప్పారు.
undefined
మరో విశేషం ఏమిటంటే నందమూరి బాలకృష్ణకు కూడా బాలు గాత్ర దానం చేశారు. దర్శకుడు బాపు తెరకెక్కించిన రామాయణగాథ శ్రీరామరాజ్యంసినిమా తమిళ వర్షన్లో బాలయ్యకుబాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది.
undefined
గిరీష్కర్నాడ్, టిను ఆనంద్, రఘువరన్, నాజర్, కిట్టి , విసు, సల్మాన్, కార్తీక్వంటి నటులకుబాలు గాత్ర దానం చేశారు.
undefined
click me!