హేబా పటేల్ క్యూట్ పిక్స్.. కుమారి అలా రూటు మార్చినా జోరు పెరగలే..!

First Published | Sep 24, 2023, 10:15 AM IST

యంగ్ బ్యూటీ హేబా పటేల్ ఇటీవల వరుస చిత్రాలతో మెరిసింది. రూటు మార్చినా..  పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకా ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah Patel)  తొలుత కన్నడ ఫిల్మ్ ‘అధ్యక్ష’తో వెండితెరపై అడుపెట్టింది. ఇక తెలుగులోకి ‘అలా, ఇలా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే వచ్చిన ‘కుమారి 21ఎఫ్’తో సెన్సేషన్ గా మారింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆశ్చర్యపరిచింది.
 

కెరీర్ ప్రారంభంలో ఈ ముద్దుగుమ్మ స్పీడ్ చూసి స్టార్ యాక్ట్రెస్ జాబితాల చేరిపోతుందని భావించారు. అన్నట్టుగానే తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది. కానీ కెరీర్ ను మలుపు తిప్పేలా పెద్దగా హిట్లు పడలేదు. అందుకు కారణంగా రోటీన్ కథలను ఎంచుకోవడమే. 
 


గత చిత్రాల ఫలితాలతో  ఈ ముద్దుగుమ్మకు నెమ్మదిగా ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. చిన్నహీరోల సినిమాలకే పరిమితం అయ్యింది. ఇక రెండేళ్ల కింద కాస్తా రూటు మార్చి స్పెషల్ అపియరెన్స్ తో  ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ‘రెడ్’ చిత్రంలో రామ్ పోతినేని సరసన గ్లామర్ స్టెప్పులేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘శాసన సభ’లోనూ ఐటెం సాంగ్ లో మెరిసింది.
 

దీంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని అభిమానులు ఆశించారు. ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రంతో నూ ఓటీటీ అదరగొట్టింది. ముఖ్యంగా హేబా పటేల్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటున్నట్టు తెలియజేసింది. ఈ తరహా చిత్రాలతో ఆమెకు మరింత క్రేజ్ దక్కించుకునే అవకాశం ఉంది. 
 

ఇదిలా ఉంటే.. హేబా పటేల్ సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. క్యూట్ సెల్ఫీలతో కట్టిపడేస్తోంది. తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులు షేర్ చేసకుంది. రూపసౌందర్యంతో కట్టిపడేసింది.

గ్లామర్ మెరుపులతో నెట్టింట సందడి చేస్తున్న హేబా పటేల్ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది. చివరిగా హేబా పటేల్ ‘శాసనసభ’, ‘తెలిసినవాళ్లు’ వంటి చిత్రాలతో అలరించింది.
 

Latest Videos

click me!