అంజలీ అరుదైన రికార్డ్.. గీతాంజలి2 సినిమాతో హాఫ్ సెంచరీ క్రాస్ చేయబోతున్న హీరోయిన్

First Published | Sep 24, 2023, 9:06 AM IST

అరుదైన రికార్డ్ ను సాధించింది అంజలి. చాలా తక్కువటైమ్ లోనే హాఫ్ సెంచిరీ కొట్టేసింది. అది కూడా ప్రస్తుతం చేయబోతున్న గీతాంజలి సీక్వెల్ తో. ఇప్పటికీ మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తోంది అంజలి.  
 

అరుదైన మైలురాయిని దాటిది హీరోయిన్ అంజలి. తన సినీప్రయాణంలోఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు, బాధలు, కష్టాలు..అన్నింటిని అధిగమించి  ప్రస్తుతం హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తన అందంతో నటనతో అటు తమిళ ప్రేక్షకులతో పాటు.. ఇటు తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కూడా కదిలించింది బ్యూటీ. ఇక ఈ హీరోయిన్ ను ప్రతీ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు..  మన పక్కింటి అమ్మాయిలా భావిస్తారు. 

 అచ్చ తెలుగు ఆడపడుచు అంజలి. కాకపోతే మన ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ లు ఇవ్వరు.. అసలు హీరోయిన్లుగా చూడరు దాంతో ఆమె చెన్నై తరలిపోయింది. అక్కడ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి..  స్టార్ డమ్ అందుకుంది అంజలి. అంతే కాదు.. తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ కూడా మంచి ఇమేజ్ ను సాధించింది.


అందరు హీరోయిన్ల మాదిరి కాదు అంజలి.  పద్దతిగా ఉంటుంది... ఎదుటివారిని నొన్పించకుండా .. తన  మాట, యాటీట్యూడ్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఇక ఈ బ్యూటీ తాజాగా 50  సినిమాల మైలురాయిని దాటింది. హాఫ్ సెంచరీ సినిమాలు పూర్తి చేసి..అరుదైన రికార్డ్ సాధించింది. అది కూడా తన హిట్ మూవీ.. తెలుగు మూవీ గీతాంజలి సీక్వెల్ తో. 

kona venkat

తాజాగా ఈమూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. కొన వెంకట్ సమర్పణలో  తెరకెక్కుతోన్న ఈసినిమా  గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూనిట్ నుంచి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈసారి మరింత భయపెట్టేందుకు రెడీ అవుతోంది అంజలి. త్వరలో మరిన్ని విషయాలను వెల్లడించనున్నారు. ఎంవీవీ మూవీస్ బ్యాన్ ర్ పై రూపుదిద్దుకుంటోంది.  

ఫొటో సినిమా  ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. అంగాడి తెరు, ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌,  వంటి సినిమాలు తమిళనాట అంజలి కెరీర్ కు మలుపు తిప్పాయి. ఇటు తెలుగులో కూడా   సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. గీతాంజలి వకీల్‌ సాబ్‌ సినిమాలతో మెప్పించింది బ్యూటీ. అంజలి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 ఏళ్ళపైనే అవుతోంది. ఇన్నేళ్లలో.. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ సినిమాల్లో నటించి మెప్పించి.. ఆకట్టుకుంది బ్యూటీ.

Heroine Anjali

కెరీర్ పీక్ లో ఉండగానే.. ఇబ్బందుల్లో పడింది అంజలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ తో పాటు..ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో చాలా కాలం సినిమాలకు దూరం అయ్యింది.  హీరో జైతో పేమ ఆతరువాత బ్రేకప్ అవ్వడంతో.. కెరీర్ లో కొంత కాలం డిస్ట్రబ్ అయ్యింది. ఇక అంజలి పని అయిపోయింది అనుకున్న టైమ్ లో.. మళ్ళీ పుంజుకుని.. ఎదిగి తనను తాను నిరూపించుకుంది అంజలి. 

అయితే అంజలి తమిళంలో ఈగై సినిమాతో హాఫ్ సెంచరి రికార్డ్ కంప్లీట్ అవ్వల్సి ఉంది. కాని ఆసినిమా ఆగిపోవడంతో.. గీతాంజలి సీక్వెల్ తో ఆ రికార్డ్ సాధించబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు.. ప్రస్తుతం రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ఇండియా మూవీ గేమ్ చేంజర్'లో కీలక పాత్రలో అలరించబోతోంది అంజలి. 

తెలుగులో చివరిగా నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో స్పెషల్ డాన్స్ తో అంజలి ఆకట్టుకుంది. ఈసినిమాతో  అంజలి క్రేజ్ ఇంకాస్త పెరిగింది. రీసెంట్ గా తమిళంలో ఝాన్సీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది బ్యూటీ.  ప్రస్తుతం మరో వెబ్ సిరీస్ తో పాటు సినిమాల్లో నటిస్తోంది.

Latest Videos

click me!