యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ఇండియా మొత్తం ఈ పేరు ఒక బ్రాండ్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఖ్యాతి దేశం సరిహద్దులు దాటింది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ప్రభాస్ కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ అంశాలతో విజువల్ గ్రాండియర్ మూవీ తెరకెక్కించాలనుకునే ఇండియన్ ఫిలిం మేకర్స్ కి ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు ప్రభాస్. కాగా రేపు అక్టోబర్ 23శనివారం రోజు ప్రభాస్ తన 42వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలయింది.
ఇదిలా ఉండగా Prabhas విషయంలో అనేక ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతూ ఉంటాయి. అందులో మొదటి ప్రశ్న Prabhas Marriage ఎప్పుడు ?అలాగే ప్రభాస్ వందల కోట్ల బిజినెస్ చేసే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ చిత్రాల రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్న కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా జ్యోతిష్యులు ఈ పాన్ ఇండియా స్టార్ జాతకాన్ని తిరగేస్తున్నారు. ప్రభాస్ జాతకంలో ఏముంది.. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది.. కెరీర్ ఎలా ఉండబోతోంది అనే వివరాలని విపులంగా వివరిస్తున్నారు.
జ్యోతిష్యులు చెప్పిన వివరాలు పరిశీలిస్తే ప్రభాస్ 1979 అక్టోబర్ 23న జన్మించారు. అనురాధ నక్షత్రం.. మీనా లగ్నంలో ప్రభాస్ జననం సంభవించింది. ప్రభాస్ జాతకాన్ని పరిశీలించినప్పుడు అతి సామాన్యులకు ఉండే జాతకంలానే అనిపిస్తుంది. ఈ జాతకం కలిగిన వారికి ఇంతటి ఖ్యాతి సాధ్యం కాదు. కానీ జాతకాన్ని పరిశీలించే కోణాలు చాలా ఉంటాయి. ప్రభాస్ జాతకాన్ని రవి స్థితి నుంచి పరిశీలించినప్పుడు అద్భుతమైనదిగా అనిపిస్తుంది.
ప్రభాస్ తొలి చిత్రం 2002లో విడుదలయింది. ఆ సమయంలో ప్రభాస్ జాతకం ప్రకారం బుధుడిలో శుక్రుడు అంతర్లీనంగా ఉన్నప్పుడు ప్రభాస్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. శుక్రుడు లేదా శుక్ర- బుధ కలయిక జాతకంలో ఉంటే అత్యధిక సక్సెస్ రేట్ ఉంటుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. రజనీకాంత్, ఎంజీఆర్ లాంటి గొప్ప నటుల జాతకం కూడా ఇలానే ఉంటుందని అంటున్నారు. శుక్రుడు కళలకి కారకుడు.. అటువంటి శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్న ప్రభాస్ కి తిరుగులేదని చెబుతున్నారు. కాబట్టి ప్రభాస్ ఫ్యూచర్ లో నటించబోయే చిత్రాలకి అత్యధిక సక్సెస్ రేట్ ఉంటుందని అంటున్నారు.
ఇక ప్రభాస్ పెళ్లి విషయంలో జ్యోతిష్యుల అంచనా ఈ విధంగా ఉంది. వివాహ అధిపతి బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ కి కేతు మహర్దశ సాగింది. కేతు మహర్దశ వివాహాన్ని యోగించదు. బుధుడు కూడా అనుకూలమైన స్థానంలో లేడు. కాబట్టి వాయిదాలు ఎక్కువగా ఉంటాయి అని చెబుతున్నారు.
ప్రభాస్ జాతకం ప్రకారం అతడి వివాహం 2023 ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యలో అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కనుక మిస్ అయితే 2025 వరకు ప్రభాస్ జాతకం ప్రకారం అతడికి పెళ్లి అయ్యే అవకాశం లేదని అంటున్నారు. మరి జ్యోతిష్యుల అంచనా నిజమవుతుందో లేదో చూడాలి. ఇప్పటికైతే ప్రభాస్ పెళ్లి చేసుకునే మూడ్ లో ఉన్నట్లు కనిపించడం లేదు. 2023లో అయినా ఓ ఇంటివాడు అవుతాడేమో చూడాలి.
ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం Radhe Shyam, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె(వర్కింగ్ టైటిల్), స్పిరిట్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలకు కమిటయ్యాడు. వీటిలో రాధే శ్యామ్ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ బర్త్ డే కానుకగా రేపు టీజర్ రిలీజ్ చేయనున్నారు. బైక్ వద్ద సూపర్ స్టైలిష్ గా ఉన్న ప్రభాస్ స్టిల్ రాధే శ్యామ్ చిత్రంలోని ఎక్స్ క్లూజివ్ పిక్.