జైలుపాలైన అన్నమయ్య హీరోయిన్, నటి కస్తూరికి జ్యుడీషియల్ రిమాండ్!

First Published | Nov 18, 2024, 11:42 AM IST

అన్నమయ్య మూవీ ఫేమ్ కస్తూరి జైలుపాలైంది. ఆమెకు కోర్ట్ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నోరు జారిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి ఊచలు లెక్కపెడుతుంది. 

Actress Kasthuri

తెలుగు మహిళలపై అనుచిత కామెంట్స్ చేసిన కేసులో  నటి కస్తూరి శంకర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పరారైన కస్తూరి హైదరాబాద్ లో ఉందన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు తెలంగాణ వచ్చారు. నవంబర్ 16 శనివారం ఆమెను పోలీసులు గచ్చిబౌలిలో గల ఓ ప్రొడ్యూసర్ ఇంట్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఎగ్మోర్ స్టేషన్ కి తరలించారు. అటు తమిళనాడుతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో నటి కస్తూరి అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. 
 

Kasthuri Arrest

ఎగ్మోర్ పోలీసులు ఆమెను స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆమెకు భారీ షాక్ ఇచ్చాడు. నవంబర్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం కస్తూరి పూజల్ సెంట్రల్ జైలు లో ఉన్నారు. జైలుపాలైన కస్తూరి వీడియో బైట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు వీడియోల్లో ఆమె తాను పారిపోలేదని తెలియజేశారు. 

నేను నాలుగు రోజుల షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాను. ప్రశాంతత కోసం ఫోన్ స్విచ్చాఫ్ చేశాను. అంతే కానీ నేను ఎక్కడికీ పారిపోలేదు. ఆ వార్తల్లో నిజం లేదు. నేను పోలీసులకు సహకరిస్తాను, అని కస్తూరి వివరణ ఇచ్చారు. 
 

Latest Videos


కస్తూరి వివాదం పరిశీలిస్తే... తమిళనాడులో నవంబర్ 3న జరిగిన ఓ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలను ఉద్దేశిస్తూ కస్తూరి అనుచిత కామెంట్స్ చేశారు.  సుమారు 300 ఏళ్ల క్రితం తెలుగు వారు తమిళనాడుకు వలస వచ్చారు. తెలుగు మహిళలు ఇక్కడి రాజుల అంతఃపురాల్లో ఆడవారికి సేవకులుగా ఉండేవారు. అలా వలస వచ్చినవారు తమిళులమని చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్న బ్రాహ్మణులను తమిళులు కాదంటున్నారని కస్తూరి ఆరోపణలు చేశారు. కస్తూరి తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ నవంబర్ 5న ఆమె మీద కేసు పెట్టింది. పలు సెక్షన్స్ క్రింద కస్తూరిని బుక్ చేశారు. అలాగే కస్తూరి తెలుగువారికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 
 

kasthuri

కస్తూరి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంది.నాకు తమిళనాడు పుట్టినిల్లు అయితే తెలుగు గడ్డ మెట్టినిల్లు లాంటిది. నేను తెలుగువారిని అవమానించలేదు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలు నన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆమె అన్నారు. ముందస్తు బెయిల్ కి ఆమె అప్లై చేశారు. అయితే కోర్టులో కస్తూరికి చుక్కెదురైంది. 

కస్తూరి బెయిల్ పిటిషన్ మదురై హైకోర్టు కొట్టివేసింది. కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్ట్ మధురై బ్రాండ్ జడ్జి ఆనంద్ వెంకటేష్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కస్తూరి పరారీలో ఉండగా, పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. 
 

 అమరన్ మూవీ పై సైతం కస్తూరి ఆరోపణలు చేయడం విశేషం. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఇటీవల విడుదలైన భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ముకుంద్ వరదరాజన్ బ్రాహ్మణుడు. ఆయన భార్య క్రిస్టియన్ ఎలా అవుతుంది.. అంటూ కస్తూరి అభ్యంతర కామెంట్స్ చేసింది. 

తమిళనాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కస్తూరి 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం గ్యాంగ్ వార్. అనంతరం నిప్పురవ్వ, అన్నమయ్య, మా ఆయన బంగారం వంటి హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి టైటిల్ తో ఒక సీరియల్ చేసింది. అన్నయ్య మూవీ అతిపెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. భారతీయుడు మూవీలో కస్తూరి కమల్ హాసన్ కూతురు పాత్ర చేసింది. 

click me!