మహేష్, పవన్, రవితేజ కాదు..ఫ్లాపుల్లో ఉన్నా పర్వాలేదు, పూరి అడిగిన వెంటనే సినిమా చేసే ఏకైక స్టార్ హీరో

First Published | Nov 18, 2024, 10:32 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. కెరీర్ లో ఎన్నడూ చూడని డిజాస్టర్లు పూరి జగన్నాధ్ కి ఎదురవుతున్నాయి. లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ పెద్ద డిజాస్టర్లు ఎదురయ్యాయి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. కెరీర్ లో ఎన్నడూ చూడని డిజాస్టర్లు పూరి జగన్నాధ్ కి ఎదురవుతున్నాయి. లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ పెద్ద డిజాస్టర్లు ఎదురయ్యాయి. దీనితో పూరి జగన్నాధ్ తాను ఎంచుకుంటున్న కథలని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

పూరి జగన్నాధ్ తన కెరీర్ లో రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఇలా బడా హీరోలందరికీ సూపర్ హిట్స్ ఇచ్చారు. పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో భారీ వసూళ్లు ఎలా ఉంటాయో తొలిసారి చూపించారు. పైగా పూరి జగన్నాధ్ సినిమా మేకింగ్ కి పెద్దగా టైం తీసుకోరు. చకచకా సినిమాలు పూర్తి చేయడంలో పూరికి పూరీనే సాటి. 


అలాంటి పూరి జగన్నాధ్ తిరిగి సాలిడ్ గా కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరి జగన్నాధ్.. బాలయ్యతో సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్య గురించి పూరి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పూరి, బాలయ్య కాంబినేషన్ లో గతంలో పైసా వసూల్ చిత్రం వచ్చింది. పైసా వసూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఈ చిత్రంలో బాలయ్య యాటిట్యూడ్ మాస్ ఆడియన్స్ ని అలరించింది. 

పూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఫ్లాపుల్లో ఉన్నా సరే నేను వెళ్లి అడిగితే వెంటనే డేట్లు ఇచ్చి సినిమా చేసే ఏకైక హీరో బాలయ్య అని పూరి జగన్నాధ్ తెలిపారు. బాలయ్య క్యారెక్టర్ అలాంటిది. ఆయన హిట్లు ఫ్లాపులు పట్టించుకోరు. మనుషులకు విలువ ఇచ్చే వ్యక్తిత్వం బాలయ్యది అని పూరి అన్నారు. 

అయితే బాలయ్య ఎందుకు అభిమానులని కొడుతుంటారు అని యాంకర్ ప్రశ్నించింది. బాలయ్య మాత్రమే కాదు చాలా మంది స్టార్ హీరోలు వాళ్ళ ఫాన్స్ ని చూసిభయపడతారు. ఎందుకంటే అంతమంది జనాల్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఎవడి చేతుల్లో ఏముందో తెలియదు. అందుకే బాలయ్య కొన్నిసార్లు అలా రియాక్ట్ అవుతుంటారు అని పూరి జగన్నాధ్ తెలిపారు. 

Latest Videos

click me!