ఆ స్టార్ హీరోయిన్ ని మోసం చేయాలనుకున్న ఎన్టీఆర్, ఆమె కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్!

First Published | Nov 18, 2024, 10:38 AM IST

ఓ స్టార్ హీరోయిన్ ని నందమూరి తారక రామారావు రెమ్యునరేషన్ విషయంలో మోసం చేయాలనుకున్నారు. అయితే ఆమె కొట్టిన దెబ్బకు ఆయన మైండ్ బ్లాక్ అయ్యింది. మోసం చేయాలని చూసి మోసపోయాడు. 
 

నందమూరి తారక రామారావు సిల్వర్ స్క్రీన్ వేదికగా చేసిన సంచలనాలు అనేకం. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలారు. ఆయన చేయని పాత్ర లేదు. కెరీర్ బిగినింగ్ లో జానపద, సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ డ్రామాలు ఆయన చేశారు. స్టార్డం వచ్చాక పౌరాణిక, మాస్ కమర్షియల్ సబ్జక్ట్స్ తో భారీ బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. 

Senior NTR-Bhanumathi

ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరు. సమయానికి ఆయన చాలా విలువ ఇచ్చేవారట. ఆయన సక్సెస్ రహస్యం కూడా అదే. ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్. తీరిక లేకుండా నటిస్తూనే ఎన్టీఆర్ పలు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. రాజకీయాల్లోకి వచ్చి కూడా సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సినిమాల్లో తాతమ్మ కల ఒకటి. ఈ సినిమాతో కొడుకు బాలకృష్ణను ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 
 


Senior NTR-Bhanumathi

తండ్రి దర్శకత్వంలో మొదటి చిత్రం చేసిన బాలకృష్ణ అనంతరం టాప్ స్టార్ గా ఎదిగారు. అనేక సంచలన విజయాలు నమోదు చేశాడు. తాతమ్మ కల మూవీ విషయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందట. హీరోయిన్ భానుమతిని మోసం చేయాలనుకున్న ఎన్టీఆర్... ఆయనే మోసపోయాడట. 

తాతమ్మ కల మూవీలో ఎన్టీఆర్, భానుమతి, బాలకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు డీవీ నరసరాజు రచయితగా పని చేశారు. రచయిత నరసరాజుకి ఎన్టీఆర్ ఒక బాధ్యత అప్పజెప్పాడట. తాతమ్మ కల మూవీలో తాతమ్మ పాత్రకు భానుమతిని అనుకుంటున్నాను. వెళ్లి ఆమెతో మాట్లాడి రెమ్యూనరేషన్ ఎంతో కనుక్కో అన్నారట. నరసరాజు హీరోయిన్ భానుమతి వద్దకు వెళ్లారట.

ఇలా తాతమ్మ కల మూవీలో మీరు నటించాలి. ఎన్టీఆర్ మీ రెమ్యూనరేషన్ ఎంతో అడిగిరమ్మన్నారు, అని భానుమతితో నరసరాజు చెప్పారట. ఆయన హీరోగా ఎంత తీసుకుంటున్నారో దానికి ఒక రూ. 5 వేలు తగ్గించి ఇవ్వండి, అన్నారట. ఆ రోజుల్లో ఎన్టీఆర్ రూ. 4-5 లక్షలు తీసుకుంటున్నారట. ఎన్టీఆర్ కి నరసరాజు ఇదే విషయం చెప్పారట. అయితే నేను రూ. 2 లక్షలు తీసుకుంటున్నాని చెప్పు అని రూ.1.90 లక్షలకు చెక్ రాసి భానుమతికి పంపించారట. 

Senior NTR-Bhanumathi

ఎన్టీఆర్ పంపిన చెక్ తీసుకోకుండా భానుమతి, ఇంకో రూ. 5 వేలు కలిపి ఇచ్చి నేను చేస్తున్న అమ్మాయి పెళ్లి మూవీలో నటించమనండి.. అని అన్నారట. భానుమతి చేసిన పనికి ఎన్టీఆర్ మైండ్ బ్లాక్ అయ్యిందట. చేసేది లేక ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ అమ్మాయి పెళ్లి మూవీలో నటించారట. తాతమ్మ కల చిత్రానికి ఎన్టీఆర్ నిర్మాత కాగా, అమ్మాయి పెళ్లి మూవీకి భానుమతి నిర్మాత. 

Senior NTR-Bhanumathi

నాలుగైదు లక్షలు తీసుకునే ఎన్టీఆర్, భానుమతి చేసిన పనికి రూ. 2 లక్షలకే అమ్మాయి పెళ్లి మూవీలో నటించాల్సి వచ్చింది. భానుమతి పరోక్షంగా రూ. 2 లక్షల ప్రయోజనం పొందింది. భానుమతిని మోసం చేయాలనుకున్న ఎన్టీఆర్ ఆమె తెలివితేటల ముందు తేలిపోయాడు. అందుకే భానుమతి అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా భయపడేవారట. 

Latest Videos

click me!