సామ్ మళ్లీ ప్రేమలో పడిందా? ఆ ఫొటోకు అర్థం అదే అంటున్నారుగా!?

First Published | Jul 30, 2023, 8:35 PM IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయాన్ని ఫ్రెండ్స్ తో టూర్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.  ఈక్రమంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సామ్ కు మంచి క్రేజ్ దక్కించుకుంది. అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ను  కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం దే వ్యాప్తంగా ఈమె ఫాలోయింగ్ ను దక్కించుకుంది. 
 

ఇదిలా ఉంటే.. సామ్ ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘యశోద’ మూవీ రిలీజ్ సమయంలో సమంత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది. అప్పటి నుంచి మొన్నటి వరకు రెగ్యులర్ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉంది.


ఇక వరుస ప్రాజెక్ట్స్ ఉండటంతో సమంత పూర్తిగా కోలుకోలేకపోయింది. దీంతో ఏడాది పాటు సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి  హెల్త్ పైనే పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా యోగా సెంటర్లు, దేవాలయాలు, టూర్లకు వెళ్తూ రిలాక్స్ అవుతోంది. ప్రస్తుతం ఇండోనేషియాలో ఫ్రెండ్స్ తో సమయం గడుపుతోంది. 
 

తన వెకేషన్ కు సంబంధించి ఎప్పటి కప్పుడు సామ్ అప్డేట్స్ అందిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సామ్ పంచుకుంటున్న పోస్ట్ లను బట్టి మళ్లీ లవ్ లోపడిందా? అని కొందరు సందేహిస్తున్నారు. ఇందుకు కారణంగా సామ్ పంచుకుంటున్న పోస్టులేనని అంటున్నారు. 
 

తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ పిక్ లో లవ్ రిటేడెట్ న్యూస్ అందించింది.. ‘ఎక్కువగా ద్వేశించే మనుషులు, మాటలు చూసి ఉంటావేమో గానీ.. మనం ఊహించని దాని కంటే  ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది’ అంటూ ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది. దీంతో సామ్ మళ్లీ లవ్ లో పడిందా అని సందేహిస్తున్నారు. 
 

ఏదేమైనా ప్రస్తుతం సమంత వెకేషన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ అందిస్తూ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ కూడా దిల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. సామ్ నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే క్రేజీ సిరీస్ ‘సిటడెల్’ కూడా రానుంది. ఈ రెండ్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన షూటింగ్ ను సామ్ పూర్తి చేసుకుంది. 
 

Latest Videos

click me!