కలర్ ఫుల్ డ్రెస్ లో ‘ఓజీ’ హీరోయిన్ ఖతర్నాక్ ఫోజులు.. కుర్ర గుండెలు గల్లంతే..

First Published | Jul 30, 2023, 7:28 PM IST

పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘OG’. ఈ చిత్రంలో తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ కూడా నటిస్తోంది. ఏకంగా పవర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం భారీ చిత్రాలకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ మూవీలోప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 
 

తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించింది. నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’తో పాటు, శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టకోలేకపోయాయి. అయినా  ప్రియాంక మాత్రం తన ప్రయత్నాల్ని ఆపలేదు. 
 


అటు సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే.. తనవంతుగా ప్రయత్నం చేస్తూనే.. ఇటు  సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. వరుసగా తన గురించిన పోస్టులు పెడుతూ వస్తోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్టలో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. బ్లూ అండ్ వైట్ డ్రెస్ లో ప్రియాంక కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా  తమిళ బ్యూటీ ఇచ్చిన ఫొజులకు ఫ్యాన్స తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. 
 

లేటెస్ట్ లుక్ లో ప్రియాంక మోహన్  స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. మత్తు ఫోజులతో మైమరిపించింది.  స్కీన్ షోకు పెద్దగా ఛాన్స్ లేకుండా ఫొటోషూట్ చేసిన ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. స్టన్నింగ్  స్టిల్స్ తో మాత్రం మైమరిపించింది. 
 

ఇదిలా ఉంటే.. ప్రియాంక మోహన్ స్టార్ హీరోల సరసన నటించినా పెద్దగా హిట్స్ దక్కించుకోలేకపోయింది. ఆమె నటించిన సినిమాల్లో ‘డాన్’ మూవీ కాస్తా అలరించింది. ఇక తర్వాత పెద్దగా సక్సెస్ లేదనే చెప్పాలి.

ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’లో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాత్రం ప్రియాంక క్రేజ్ పెరుగనుందని అర్థమవుతుందోని భావిస్తున్నారు. ఈ మూవీలో యాక్షన్ తో అలరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 
 

అంతవరకు ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్ కూడా చేస్తూ ఇలా ఆకట్టుకుంటోంది. తన క్రేజ్ మరింతగా పెంచుకుంటోంది. 

Latest Videos

click me!