పూరీ జగన్నాథ్ తో గొడవపై హరీష్‌ శంకర్‌ అదిరిపోయే ఆన్సర్‌.. ఛార్మీ చేసిన పనికి కౌంటర్ చూశారా?

First Published | Jul 28, 2024, 9:20 PM IST

`డబుల్‌ ఇస్మార్ట్`, `మిస్టర్‌ బచ్చన్‌` సినిమాలు పోటీ నేపథ్యంలో హరీష్‌ శంకర్‌, పూరీ మధ్య గొడవలు నెలకొన్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై హరీష్‌ స్పందించాడు. 
 

 చిత్ర పరిశ్రమలో ప్రత్యేక అకేషన్స్ లో సినిమాల మధ్య పోటీ నెలకొంటుంది. ఒకేసారి రెండు మూడు, నాలుగు సినిమాలు వస్తుంటాయి. పెద్ద సినిమాలు వచ్చినప్పుడే సమస్య. దసరా, సంక్రాంతి, ఉగాది, దీపావళి, ఆగస్ట్ 15 వంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ ఆగస్ట్ 15న నాలుగు పెద్ద సినిమాలు వస్తున్నాయి. రవితేజ `మిస్టర్‌ బచ్చన్‌`, రామ్‌ `డబుల్‌ ఇస్మార్ట్`, ఎన్టీఆర్ బామ్మర్ది మూవీ `ఆయ్‌`తోపాటు డబ్బింగ్‌ మూవీ `తంగలాన్‌` రిలీజ్‌ అవుతున్నాయి. 

అయితే వీటిలో పూరీ రూపొందించిన `డబుల్‌ ఇస్మార్ట్`, హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన `మిస్టర్‌ బచ్చన్‌` ల మధ్య పోటీ నెలకొంటుంది. బాక్సాఫీసు వద్ద ఈ రెండు చిత్రాలు ఎక్కువగా పోటీ పడాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. దీనికితోడు పూరీతో, హరీష్‌ శంకర్‌కి గొడవ జరిగినట్టు, పూరీకి, రవితేజకి మధ్య రిలేషన్‌ చెడిందనే ప్రచారం జరుగుతుంది. ఛార్మి.. హరీష్‌ని అన్‌ఫాలో కావడం కూడా ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. దీంతో ఈ రెండు సినిమాల విషయంలో హరీష్‌, రవితేజకి, పూరీ, ఛార్మికి మధ్య విభేదాలు నెలకొన్నాయనే చర్చ నడుస్తుంది. 
 

Latest Videos


ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై హరీష్‌ శంకర్‌ స్పందించారు. పూరీ జగన్నాథ్‌, వినాయక్‌, రాజమౌళి తాను ఎదుగుతున్న రోజుల నుంచి విపరీతంగా తనని ఎంకరేజ్‌ చేశారని, నా సినిమాల్లో డైలాగులు నచ్చినా, పాటలు నచ్చినా ఫోన్‌ చేసి అప్రిషియేట్‌ చేయడంగానీ, కలిసినప్పుడు మాట్లాడటం గానీ చేస్తుంటారు. ఎప్పుడూ నన్ను ఎంకరేజ్‌ చేశారు. ఈ ముగ్గురు నాకు గురువులతో సమానం. పూరీ జగన్నాథ్‌తో ఆయన సినిమాలకు పనిచేశాను. ఏ రోజూ పూరీగారితో పోల్చుకునే స్థాయి కాదు నాది. ఆయన లెజెండ్‌ డైరెక్టర్‌. 

మాకున్న ఆర్థిక సమస్యలు, ఓటీటీ లెక్కలు కావచ్చు, అనుకోకుండా ఈ డేట్‌(ఆగస్ట్ 15) క్లాష్‌ అవుతున్నాయి. `డబుల్‌ ఇస్మార్టే` ముందు అనౌన్స్ చేశారు. మాకసలు వచ్చే ఉద్దేశ్యమే లేదు. మైత్రీ మూవీస్‌ అధినేత శశి మమ్మల్ని ఈ డేట్‌కి రావాలని ఫోర్స్ చేశాడు.  నిజానికి ఈ డేట్కా రావాలని అనుకోలేదు, కాస్త రిలాక్స్ గానే వద్దామనుకున్నాం. కానీ ఆయన చెప్పడం, `పుష్ప2` వాయిదా పడటం, ఇలా రకరకాల కారణాలతో ముందడుగు వేశాం. పూరీతో చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఒక్క సినిమా కారణంగా మేం విడిపోతామని అనుకోవడం లేదు. ఆయన నాకంటే చాలా మెచ్చూర్డ్ పర్సన్‌` అని చెప్పారు హరీష్‌ శంకర్‌. 
 

Puri Jagannadh

ఛార్మీ తనని ట్విట్టర్‌లో అన్‌ ఫాలో చేయడంపై హరీష్‌ స్పందిస్తూ, `సినిమాకి ఆమె నిర్మాత. తాను ముందు డేట్ ప్రకటించిన సినిమాపై మరో సినిమా వస్తే, నిర్మాతగా ఆమెకి ఇరిటేషన్‌గా, కోపంగానే ఉంటుంది. ఆ విషయంలో ఛార్మిని తాను తప్పుపట్టను. సోషల్‌ మీడియా అనేది ఎవరి ఇష్టం వాళ్లది. ఆమె అన్‌ ఫాలో అయినట్టు కూడా చూసుకోలేదు. మీమ్స్ ఎవరో పంపిస్తే చూశాను. అలాంటివి చాలా వస్తుంటాయి. దాన్ని నేను పట్టించుకోను. నెక్ట్స్ నేను రామ్‌తో సినిమా చేయబోతున్నా. నేను సినిమా చేసే హీరోతో కావాలని క్లాష్‌కి వెల్లడం లేదు. ఇది అనుకోకుండా జరిగింది. తప్పడం లేదు. దీన్ని అంతా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నా` అని తెలిపాడు హరీష్‌. 
 

ఒకవేళ పూరీ జగన్నాథ్‌ మీకు ఫోన్‌ చేసి సినిమా పోస్ట్ పోన్‌ చేసుకోమని అడిగితే వాయిదా వేస్తారా? అనేప్రశ్నకి హరీష్‌ రియాక్ట్ అవుతూ, పూరీతో మీకున్న రిలేషన్‌ కంటే నాకున్న రిలేషన్‌ ఎక్కువ. ఆయన గనుక ఒక విషయాన్ని కాల్‌ చేసి చెబుతున్నాడంటే అది మా ఇద్దరి మధ్య పర్సనల్‌ విషయం అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఆయన అలాంటి కాల్స్ చేయడు. ఆయన చేసిన తర్వాత మేం చేయకపోతే అడగొచ్చు, అంత పెద్ద డైరెక్టర్‌ మీ సినిమాని పోస్ట్ పోన్‌ చేసుకోమని అడుగుతాడా? మీరు అవమానించినట్టే కాదా` అంటూ ఫైర్‌ అయ్యాడు హరీష్‌. 
 

click me!