పవన్ కళ్యాణ్-అకీరా కలిస్తే ఏం మాట్లాడుకుంటారో తెలుసా? షాకింగ్ మేటర్ లీక్ చేసిన రేణు దేశాయ్!

Published : Jul 28, 2024, 07:03 PM ISTUpdated : Jul 29, 2024, 06:56 AM IST

రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరొక మహిళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేణు దేశాయ్ కుమారుడు అకీరా తండ్రి పవన్ ని కలిస్తే ఏం మాట్లాడతాడనే ఆసక్తి అందరిలో ఉంది.. 

PREV
16
పవన్ కళ్యాణ్-అకీరా కలిస్తే ఏం మాట్లాడుకుంటారో తెలుసా? షాకింగ్ మేటర్ లీక్ చేసిన రేణు దేశాయ్!
Pawan Kalyan

రేణు దేశాయ్ పూణేలో ఉన్నప్పుడు పిల్లల కోసం పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు అక్కడకు వెళ్లేవాడట. పవన్ కళ్యాణ్-అకీరా కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఏ భాషలో మాట్లాడుకుంటారు? అనేది రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే ఆద్యతో ఒక భాషలో, అకీరాతో మరొక భాషలో పవన్ మాట్లాడుతారట... 

26

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చినా స్నేహం కొనసాగిస్తున్నారు. పిల్లలకు తండ్రిగా కొనసాగుతున్నారు. విడాకులు అనంతరం రేణు దేశాయ్ పూణేకి వెళ్ళిపోయింది. తన ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంది. పవన్ కళ్యాణ్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని రేణు దేశాయ్ పలు సందర్భాల్లో అన్నారు. 

 

36
Pawan Kalyan and Akira Nandan

నిజానికి పవన్ కళ్యాణ్ తరచుగా పూణే వెళ్ళేవాడని సమాచారం. పిల్లలు ఆయనతో టచ్ లో ఉండేవారు. కలవాలని ఫోన్ చేస్తే వీలు చేసుకుని పవన్ కళ్యాణ్ పూణే వెళ్లేవాడట. మరి పవన్ కళ్యాణ్-అకీరా కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఏ భాషలో మాట్లాడుకుంటారు? ఆద్య వాళ్ళ నాన్నతో ఎలా ఉంటుందో... ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో రేణు దేశాయ్ గతంలో వెల్లడించింది. 

46
Pawan Kalyan and Akira Nandan

రేణు దేశాయ్ మాట్లాడుతూ...  ఆద్య చాలా కమాండింగ్ గా ఉంటుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చూసి నువ్వు ఎప్పుడు కలుస్తావు. మమ్మల్ని చూడాలని లేదా... నువ్వు వెంటనే రావాలని గట్టిగా మాట్లాడుతుంది. అకిరా అలా కాదు. ఆద్యతో నేను మరాఠిలో మాట్లాడతాను. తనతో మరాఠీలోనే మాట్లాడాలని ఆద్య కండిషన్ పెట్టింది. అకీరాతో మాత్రం తెలుగులో మాట్లాడతాను. వాళ్ళ నాన్న భాష అకీరా మర్చిపోకూడదు కదా.. 
 

56
Pawan Kalyan and Akira Nandan

అకీరా-పవన్ తెలుగులోనే మాట్లాడుకుంటారు. వాళ్ళు లైఫ్, ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ మధ్య సినిమా ప్రస్తావన రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. నేను కూడా ఆయనతో మాట్లాడతాను. విడాకుల తర్వాత మేము మిత్రులు గా కొనసాగుతున్నామని గతంలో కూడా నేను చెప్పాను.

 

66

ఆద్య వాళ్ళ నాన్నతో మరాఠీలోనే మాట్లాడుతుంది. నా కోసం ఆయన భాష నేర్చుకోలేదు. ఆద్య కోసం మరాఠీ నేర్చుకున్నారు. ఆద్య-పవన్ మరాఠీలో మాట్లాడుకుంటారని... చెప్పుకొచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్, అకీరా కలిస్తే సినిమా ప్రస్తావన రాదట. లైఫ్, ఫిలాసఫీ మాట్లాడుకుంటారట. 
ఇక అకీరా టీనేజ్ దాటేసి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. 

Read more Photos on
click me!

Recommended Stories