Pawan Kalyan: సినిమా డైలాగ్స్ తో పొలిటికల్ ఇమేజ్ పెరుగుతుందా పవన్?... కెజిఎఫ్ డైలాగ్ భలే కొట్టేశారే!

Published : Apr 28, 2022, 04:53 PM IST

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ మూవీ డైలాగ్ ఒకటి లీక్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ఆ డైలాగ్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ డైలాగ్ పై పవన్ ఫ్యాన్స్ ఆహా ఓహో అంటుంటే జనాలు మాత్రం చివరికి డైలాగ్ కూడా రీమేక్ చేస్తున్నారా? అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

PREV
16
Pawan Kalyan: సినిమా డైలాగ్స్ తో పొలిటికల్ ఇమేజ్ పెరుగుతుందా పవన్?... కెజిఎఫ్ డైలాగ్ భలే కొట్టేశారే!
Pawan Kalyan

ఆచార్య (Acharya)మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్, కొరటాల శివలను దర్శకుడు హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేశారు. పనిలో పనిగా తన అప్ కమింగ్ మూవీని కూడా ప్రమోట్ చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే భవదీయుడు భగత్ సింగ్ మూవీలోని ఓ డైలాగ్ లీక్ చేశారు. భవదీయుడు భగత్ సింగ్ మూవీ డైలాగ్ గురించి చిరంజీవి అడగ్గానే.. హరీష్ మొహమాటం లేకుండా ఆ డైలాగ్, దాని వెనుకున్న చిన్నపాటి నేపథ్యం చెప్పారు. 
 

26

హరీష్ (Harish Shankar)చెప్పిన ఆ డైలాగ్ ఏమిటంటే... ‘మొన్న వీడు మన ఇంటికొచ్చి, పెద్దగా అరిచినప్పుడు, అసలు ఎంట్రా వీడి ధైర్యం అని అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది. వీడు నడిస్తే వెనకాల లక్షమంది నడుస్తున్నారు. బహూశా ఇదే ఇతని ధైర్యమేమో....  లేదు సార్.. ఆ లక్షలాది మందికే ఆయన ముందుండి నడుస్తున్నాడన్నదే ధైర్యం..’'. 
 

36

ఈ డైలాగ్ విన్న వెంటనే సోషల్ మీడియాలో సెటైర్స్ మొదలయ్యాయి. అయ్యా సినిమాలే కాదు డైలాగ్స్ కూడా రీమేక్ చేస్తున్నారా? అంటూ నెటిజెన్స్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ని ఓ ఆటాడుకుంటున్నారు. కారణం... హరీష్ చెప్పిన ఈ డైలాగ్ కొంచెం అటు ఇటుగా కెజిఎఫ్ డైలాగ్ కి దగ్గరగా ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ... కెజిఎఫ్ డైలాగ్ ని హరీష్ శంకర్ పవన్ కోసం రీమేక్ చేశాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 
 

46

కెజిఎఫ్ (KGF)సిరీస్ సంచలన విజయం నేపథ్యంలో మూవీలోని ప్రతి సన్నివేశం, సీన్, డైలాగ్స్ జనాలకు బాగా ఎక్కేశాయి. ఆ సినిమా స్పూర్తితో ఏం చేసినా సినిమా లవర్స్ పట్టేస్తున్నారు. దాదాపు కెజిఎఫ్ సినిమాలోని డైలాగ్ కి కొంచెం మార్పులు చేర్పులు చేయడంతో ఆయన దొరికిపోయాడు. నిజానికి హరీష్ వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్ కి ఫేమస్. గబ్బర్ సింగ్ సినిమా కోసం ఆయన రాసిన వన్ లైనర్స్ బాగా పేలాయి. నాకు తిక్కుంది దానికో లెక్కుంది, కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

56

అలాంటి హరీష్ ఇలాంటి కాపీ డైలాగ్స్ రాయడం ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య పవన్ సినిమాల్లో డైలాగ్స్...  పొలిటికల్ మైలేజ్ ఇచ్చేవిగా, ప్రత్యర్ధులను తిట్టేవిగా ఉంటున్నాయి. ఆ కోవకు చెందిందే ఈ డైలాగ్ అన్న మాట. భీమ్లా నాయక్ మూవీలో త్రివిక్రమ్ రాసిన '' ప్రతి శుక్రవారం వచ్చి సంతంకం పెట్టి వెళ్ళు నాకొడక'' డైలాగ్ విమర్శలపాలైంది. నిజానికి ఈ డైలాగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ రాసుకున్నదే. కానీ పవన్ తో పాటు త్రివిక్రమ్ ని ఓ వర్గం తిట్టిపోసింది. జనసేన వర్గాలకు ఈ తరహా డైలాగ్స్ మహా జోష్ ఇస్తాయి.

66

కాబట్టి పవన్(Pawan Kalyan) రాబోయే సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ ఇంకా ఎక్కువ మోతాదులో ఉంటాయి. తన సినిమాల్లో ఫైట్స్, సాంగ్స్  నచ్చిన విధంగా కంపోజ్ చేసుకునే పవన్, ఈ మధ్య డైలాగ్స్ పై ఫోకస్ పెట్టారు. సినిమా డైలాగ్స్ తో తన పొలిటికల్ కెరీర్ పైపైకి వెళ్లాలని కోరుకుంటున్నారు. పనిలో పనిగా ప్రత్యర్థులను బూతులు తిట్టే వేదికగా సినిమాను మార్చేస్తున్నారు. మరి స్టార్ హీరోతో సినిమా అంటే దర్శకులు రచయితలు వాళ్ళ అభిమతం మేరకు నడుచుకోవాల్సిందే. 

Read more Photos on
click me!

Recommended Stories