Kanmani Rambo Khatija Review: 'కన్మణి రాంబో ఖతీజా' మూవీ రివ్యూ

First Published | Apr 28, 2022, 4:44 PM IST

సౌత్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు నయనతార, సమంత. వీరిద్దరూ విజయ్ సేతుపతితో కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'కన్మణి రాంబో ఖతీజా'. 

సౌత్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు నయనతార, సమంత. వీరిద్దరూ విజయ్ సేతుపతితో కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'కన్మణి రాంబో ఖతీజా'.  ఇలాంటి క్రేజీ హీరోయిన్లు కలిసి ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉండే చిత్రంలో నటిస్తుంటే మంచి బజ్ ఏర్పడాలి. వీరిద్దరూ సోలోగా నటించిన సినిమాలు కూడా స్టార్ హీరోల చిత్రాలతో పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ షాకింగ్ గా ఈ చిత్రానికి ఎలాంటి బజ్ లేదు. 

కన్మణి రాంబో ఖతీజా చిత్రం నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీకి బజ్ లేనప్పటికీ నయన్, సమంత ఫాన్స్ లో మాత్రం ఆసక్తి రేపింది. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 


కథ :

చిన్న విలేజ్ నుంచి వచ్చిన కుర్రాడిగా రాంబో పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడు. రాంబో ఎలాంటి ప్రయత్నం చేసినా చెడుగానే జరుగుతూ ఉంటుంది. దీనితో విసిగిపోయిన అతడు ఏదైనా పని చేసుకుందాం అని సిటీకి వెళతాడు. పగలు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కన్మణి( నయనతార) ప్రేమలో పడతాడు. అలాగే రాత్రి వేళల్లో బౌన్సర్ గా పనిచేస్తూ ఖతీజా (సమంత) ఆకర్షణకు గురవుతాడు. చిన్న గ్రామం నుంచి వచ్చిన కుర్రాడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో ఎందుకు పడ్డాడు. అసలు నిజం తెలిసాక కన్మణి, ఖతీజా ఎలా రియాక్ట్ అయ్యారు ? రాంబో చివరికి ఎవరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ? అని తెలుసుకోవడమే మిగిలిన కథ. 

విశ్లేషణ :

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు కోకొల్లలుగా వచ్చాయి. కానీ వాటిలో విజయం సాధించింది మాత్రం కొన్నే. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అంటే రొమాన్స్, ఫన్, చివర్లో ఎమోషన్స్.. ఎక్కువగా ఇదే ఫార్ములాలో ఉంటాయి. దర్శకుడు విగ్నేష్ శివన్ ఇదే ఫార్ములాలో కథని డిజైన్ చేసుకున్నారు. కానీ తెరకెక్కించిన విధానం మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పుకోవాల్సింది స్టార్ కాస్టింగ్, వారి మధ్య కొన్ని సన్నివేశాల్లో పండిన కెమిస్ట్రీ. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. ఎస్ఆర్ కథిర్, విజయ్ కార్తీక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. కథ బలంగా లేకపోవడం.. పూర్తిస్థాయిలో ఎమోషన్స్, ఫన్ వర్కౌట్ కాకపోవడం మైనస్ గా చెప్పొచ్చు. 

ప్రతి సన్నివేశం కలర్ ఫుల్ గా ఉంటుంది. నయనతార, సమంత కెమెరాని అట్రాక్ట్ చేసే విధంగా అందంగా కనిపించారు. దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరు హీరోయిన్లు.. వారి మధ్యలో నలిగిపోయే హీరో ఉన్నాడు కాబట్టి ఫన్ బాగా ఉంటుంది అని భావించాడేమో.. అందుకే ఎమోషన్స్ పై వర్కౌట్ చేసినట్లు అనిపించలేదు. కథలో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ బలవంతంగా ప్రేక్షకులపై రుద్దుతున్నట్లు అనిపిస్తాయి. దీనికి తోడు కామెడీ కూడా సో సో గానే ఉండడంతో సినిమా తేలిపోయింది. 

నటీనటులు :

ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ చిత్రంలోని స్టార్ కాస్టింగ్ నయనతార, సమంత, విజయ్ సేతుపతి ఈ ముగ్గురే ఈ చిత్రానికి బలం. ముఖ్యంగా రాంబో పాత్రలో విజయ్ సేతుపతిని మినహా మరే నటుడిని ఊహించుకోలేం. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే వ్యక్తిగా విజయ్ అద్భుతంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తన పెర్ఫామెన్స్ తో విజయ్ ప్రేక్షకులని అరెస్ట్ చేస్తాడని చెప్పాలి. 

ఇక నయనతార తన లిమిట్స్ లో తాను ఉండే మిడిల్ క్లాస్ అమ్మాయిల బాగా నటించింది. సమంత ఓపెన్ మైండ్ తో ఉండే గ్లామర్ గర్ల్ గా కనిపించింది. సమంత నటించే సన్నివేశాలు ప్రేక్షకులకు కొంత రిఫ్రెష్ ని అందిస్తాయి. ఇక ఇతర నటీనటులతో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్షే అని చెప్పాలి. కథలో బలమైన ఎమోషనల్స్ సృష్టించగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు తన నేరేషన్ తో సిల్లీగా అనిపించే సన్నివేశాలు రాసుకున్నారు. 

టెక్నికల్ గా.. 

మొదటగా దర్శకత్వం విషయాన్ని వస్తే.. విగ్నేష్ శివన్.. నయనతార, సమంత, విజయ్ సేతుపతి క్రేజ్ పైనే పూర్తి ఆధారపడినట్లు అనిపిస్తుంది. వీరితో కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని ఫన్ సీన్స్ పెట్టేస్తే చాలు అని భావించి కథలోని మెయిన్ పాయింట్ ని బలైన స్క్రిప్ట్ గా మార్చలేకపోయాడు. దీనితో అవుట్ ఫుట్ కూడా తేలిపోయింది. అనిరుద్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. నయన్, సమంత ఇద్దరి కాస్ట్యూమ్స్ చాలా బావుంటాయి. ఇక తెలుగు డబ్బింగ్ డైలాగు బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్స్ బావుంటాయి. 

ఫైనల్ థాట్ : ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా మొదలు పెట్టి చివరికి కిచిడీ చేశారు. 

రేటింగ్ : 2/5

ఎవరెవరు :

నటీనటులు : విజయ్ సేతుపతి, సమంత, నయనతార 

దర్శకుడు : విగ్నేష్ శివన్ 

నిర్మాత : లలిత్ కుమార్ 

సంగీతం : అనిరుధ్ 

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ : ఎస్ఆర్ కథిర్, విజయ్ కార్తీక్ 

Latest Videos

click me!