`హరి హర వీరమల్లు` 4 రోజుల కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా?

Published : Jul 28, 2025, 09:34 PM IST

`హరి హర వీరమల్లు` మూవీ వీకెండ్‌ కలెక్షన్ల లెక్కలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో ఇందులో తెలుసుకుందాం. 

PREV
15
`హరి హర వీరమల్లు`లో కంటెంట్‌ అప్‌ డేట్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` థియేటర్లలో రచ్చ చేస్తోంది. ఈ మూవీ పవన్‌ అభిమానులను అలరిస్తోంది. కామన్‌ ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. 

అయితే టీమ్‌ మాత్రం సినిమాకి మెరుగులు దిద్దారు. ఫైనల్‌ వెర్షన్‌ యాడ్‌ చేశారు. కొంత ట్రిమ్‌ చేశారు. కొన్ని వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించి అప్‌ డేటెడ్‌ సీన్స్ ని యాడ్‌ చేశారు. అలా వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఉన్న విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

DID YOU KNOW ?
పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్
`హరి హర వీరమల్లు` మూవీ పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ చిత్రానికి ఫస్ట్ డే రూ.70కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్టు సమాచారం.
25
పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో హైయ్యెస్ట్ ఓపెనింగ్‌

ఇదిలా ఉంటే `హరి హర వీరమల్లు` సినిమాకి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని కోట్లు వసూళు చేశాయనేది చూస్తే. ఈ మూవీ డీసెంట్‌ నెంబర్స్ ని వసూలు చేస్తోంది.

 గురువారం (జులై 24న) ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. కాకపోతే రెండో రోజు నుంచి తగ్గాయి. నెగటివ్‌ టాక్‌ ఇంపాక్ట్ పడింది. మూడో రోజు పెరగడం విశేషం.

35
`హరి హర వీరమల్లు` నాలుగు రోజుల కలెక్షన్లు

నాల్గో రోజు కూడా ఈ మూవీకి మంచి వసూళ్లు వచ్చాయి. పది కోట్లకుపైగానే కలెక్షన్లని రాబట్టినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.105 కోట్లు రాబట్టినట్టు సమాచారం. 

ఈ లెక్కన `హరి హర వీరమల్లు` యాభై కోట్లకుపైగా షేర్‌ని సాధించింది. సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా రూ.130కోట్ల(గ్రాస్‌) వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది. రూ. 125కోట్లు బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఉన్నట్టు సమాచారం.

మరి అంత భారీ వసూళ్లని రాబట్టగలదా అనేది చూడాలి. అప్పుడే సినిమా బయ్యర్లు సేఫ్‌లో ఉంటారు. నిర్మాత ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే నష్టాలు తప్పవు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

45
`హరి హర వీరమల్లు` హిందీలో ఆగస్ట్ 1 నుంచి?

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన `హరి హర వీరమల్లు` మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్‌ విలన్‌గా చేశారు. 

సునీల్‌, రఘుబాబు, నాజర్‌, కబీర్‌ సింగ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఏఎం రత్నం నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. హిందీ వెర్షన్‌ ఆగస్ట్ 1 నుంచి రిలీజ్‌ కాబోతున్నట్టు తెలుస్తోంది.

55
ఔరంగజేబ్‌కి వ్యతిరేకంగా వీరమల్లు పోరాటం

17 శతాబ్దం నేపథ్యంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ ఆగడాలను ప్రధానంగా చేసుకుని, హిందువులుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలనే నిబంధన పెట్టిన నేపథ్యంలో దాన్ని వీరమల్లు ఎలా ఎదుర్కొన్నారు. 

కొహినూర్‌ వజ్రాన్ని తీసుకురావడం కోసం ఆయన చేసే జర్నీ ప్రధానంగా ఈ మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. క్రిష్‌ ఈ మూవీని స్టార్ట్ చేసి మధ్యలోనే తప్పుకున్నారు, ఆ తర్వాత జ్యోతికృష్ణ సినిమాని పూర్తి చేశారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories