చిరంజీవి, రాజశేఖర్ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? మెగాస్టారే రిజెక్ట్ చేశాడా?

Published : Jul 28, 2025, 07:45 PM IST

 మెగాస్టార్‌ చిరంజీవి, డాక్టర్‌ రాజశేఖర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. ఈ ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ కొద్దిలో మిస్‌ అయ్యింది. దానికి కారణం ఎవరు? ఆ మూవీ ఏంటనేది చూస్తే  

PREV
15
చిరంజీవి, రాజశేఖర్‌ మధ్య వివాదం

 మెగాస్టార్‌ చిరంజీవి, డాక్టర్‌ రాజశేఖర్‌ మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. రాజకీయపరమైన విమర్శలు గొడవలకు దారితీశాయి. చిరంజీవిని పొలిటికల్‌గా విభేదించారు రాజశేఖర్‌. 

అదే సమయంలో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ కి సంబంధించిన కూడా ఆయన పలు విమర్శలు చేశారు. ఇది కేసులు, కోర్ట్ వరకు వెళ్లింది. ఈ కేసులో రాజశేఖర్‌ జైలుకు కూడా వెళ్లినట్టు సమాచారం.

DID YOU KNOW ?
`ఠాగూర్‌` మిస్‌ చేసుకున్న రాజశేఖర్‌
చిరంజీవి కెరీర్‌లో `ఠాగూర్‌` మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మొదట హీరోగా రాజశేఖర్‌నే అనుకున్నారు. కానీ ఆయనే రిజక్ట్ చేశారు.
25
చిరంజీవి, రాజశేఖర్‌ కలిసి నటించాల్సిన సినిమా

ఇదిలా ఉంటే ఇవన్నీ కాకముందు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. చిరంజీవి చేయాల్సిన మూవీస్‌ రాజశేఖర్‌ చేశారు. రాజశేఖర్‌ చేయాల్సిన మూవీస్‌ చిరంజీవి కూడా చేశారు.

 అంతేకాదు ఓ సినిమా మాత్రం చిరంజీవి, రాజశేఖర్‌ కలిసి చేయాల్సింది. రాజశేఖర్‌ స్వయంగా ఆ మూవీలో నటిస్తానని చెప్పారట. కానీ చిరంజీవి రిజెక్ట్ చేసినట్టు రాజశేఖర్‌ తెలిపారు. ఆ సినిమా ఏంటి? ఆ కథేంటో చూద్దాం.

35
చిరంజీవికి మంచి హిట్‌ ఇచ్చిన `స్నేహం కోసం`

 చిరంజీవి కెరీర్‌లో మంచి హిట్‌ చిత్రాల్లో `స్నేహంకోసం` ఒకటి. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో ఆయనే రూపొందించిన `నట్పుక్కగా` చిత్రానికి రీమేక్‌.

 ఇందులో చిరంజీవి, విజయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. చిరు ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా, కొడుకుగా కనిపించారు. మీనా హీరోయిన్‌గా చేసింది. ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించారు. 1999లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది.

45
`స్నేహంకోసం`లో రాజశేఖర్‌ నటించాల్సింది

అయితే ఈ మూవీ రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు విజయకుమార్‌ పాత్రకి తాను నటిస్తానని రాజశేఖర్‌ అన్నారట. అదే విషయాన్ని చిరంజీవికి చెప్పారట. కానీ చిరంజీవి రిజెక్ట్ చేశారట.

 `రాజశేఖర్‌ నీ ఏజ్‌ చిన్నగైపోతుంది, నువ్వు సూట్‌ కావు` అని అన్నారట చిరంజీవి. దీంతో ఆ మూవీలో నటించలేకపోయారు రాజశేఖర్‌. 

అలా చిరంజీవి, రాజశేఖర్‌ కలిసి నటించే ఛాన్స్ మిస్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఐ డ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్‌ చెప్పారు.

55
`విశ్వంభర`, `మెగా157` చిత్రాలో చిరంజీవి బిజీ

మొత్తంగా ఈ అరుదైన కాంబినేషన్‌ మిస్‌ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రయత్నాలు జరగలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 

ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన సాంగ్‌ షూటింగ్‌ జరిగింది. దీంతోపాటు అనిల్‌ రావిపూడితో మూవీ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇది కూడా చిత్రీకరణ దశలో ఉంది.

మరోవైపు రాజశేఖర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంటున్నారు. త్వరలో ఆయన ఓ యంగ్‌ హీరో మూవీతో రాబోతున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories