పంథా మార్చిన పవన్ హీరోయిన్ నోరా ఫతేహి... బోల్డ్ బ్యూటీని ఇంత పద్దతిగా చూడలేమంటున్న జనాలు!

Published : Jan 20, 2023, 12:01 PM IST

హీరోయిన్ నోరా ఫతేహి తనలోని కొత్త కోణం పరిచయం చేశారు. ఎప్పుడూ అరకొరా బట్టలతో హీటెక్కించిన ఫారిన్ భామ సాంప్రదాయ దుస్తుల్లో తయారయ్యారు.   

PREV
17
పంథా మార్చిన పవన్ హీరోయిన్ నోరా ఫతేహి... బోల్డ్ బ్యూటీని ఇంత పద్దతిగా చూడలేమంటున్న జనాలు!
Nora Fatehi


నోరా అంటే హాట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆమె గ్లామరస్ ఫోటోల కోసం సోషల్ మీడియా జనాలు తెగ ఎదురుచూస్తూ ఉంటారు. మిలియన్స్ కొద్దీ ఉన్న ఫాలోవర్స్ ఫోటోలు షేర్ చేయాలని కోరుకుంటారు. అలాంటి నోరా ట్రెడిషనల్ లుక్ ఫ్యాన్స్ కి ఓ డిఫరెంట్ కిక్ ఇస్తుంది. 
 

27
Nora Fatehi

 కెనడాకు చెందిన నోరా ఫతేహి(Nora Fatehi) మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు 15కి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.

37
Nora Fatehi

ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోజులకు నోరా బాగా ఫేమస్. ఈ ఇంటర్నేషన్ ఫిగర్ ని ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు.  నోరా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.   
 

47
Nora Fatehi

అనూహ్యంగా హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) మూవీలో నోరా ఫతేహి ఆఫర్ పట్టేశారు. పవన్ పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చిందని సమాచారం. 
 

57
Nora Fatehi

హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ ప్రధాన హీరోయిన్ అని సమాచారం. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది. ఆమెది కేవలం వ్యాంప్ క్యారెక్టర్ కూడా కావచ్చనే వాదన ఉంది. 
 

67
Nora Fatehi

హరి హర వీరమల్లు నుండి నిధి అగర్వాల్ లుక్ విడుదల చేశారు. అయితే నోరా ఫతేహి రోల్ గురించి చిత్ర యూనిట్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. హరి హర వీరమల్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. 
 

77

గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించారు. హరి హర వీరమల్లుతో మరోమారు టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories