`హరి హర వీరమల్లు` 3 రోజుల వసూళ్లు.. ఫేక్‌ కలెక్షన్లపై దర్శకుడు జ్యోతికృష్ణ రియాక్షన్‌ ఇదే

Published : Jul 27, 2025, 01:18 PM IST

`హరి హర వీరమల్లు` మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేశాయో లెక్కలు బయటకు వచ్చాయి. ఈ చిత్రం రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వసూళ్లు పెరగడం విశేషం. 

PREV
15
కొహినూర్‌ వజ్రం చుట్టూ తిరిగే `హరి హర వీరమల్లు`

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` మూవీ గురువారం విడుదలై మిశ్రమ స్పందనతో రన్‌ అవుతోంది. ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం నిర్మించారు. 

సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు.

 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్య కాలంలో కొహినూర్‌ వజ్రం కోసం వీరమల్లు చేసే పోరాటం ప్రధానంగా ఈ కథ సాగుతుంది. 

ఔరంగజేబ్‌ ఆగడాలను చూపిస్తూ, హిందువులుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలనే నిబంధనని తెచ్చి జనాలను ఎలా ఇబ్బంది పెట్టాడనేది ఇందులో చూపించారు.

DID YOU KNOW ?
పవన్‌ ఫస్ట్ హిస్టారికల్‌ మూవీ
పవన్‌ కళ్యాణ్‌ నటించిన తొలి హిస్టారికల్‌ మూవీ `హరి హర వీరమల్లు`. 17వ శతాబ్దం మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబ్‌ కథతో రూపొందిన మూవీ ఇది.
25
`హరి హర వీరమల్లు` మూవీ కలెక్షన్లు

`హరి హర వీరమల్లు` మొదటి రోజు మంచి వసూళ్లని రాబట్టింది. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించింది. ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్‌ ద్వారా సుమారు రూ. 13కోట్ల కలెక్షన్లు రావడం విశేషం.

 మొదటి రోజు ఇండియాలో రూ. 34.75కోట్లు రాబట్టింది. రెండో రోజులు ఎనిమిది కోట్లు. మూడో రోజు రూ.9.86కోట్లు రాబట్టింది. 

ఇలా మూడు రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో రూ.65కోట్లు(నెట్‌) వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్‌ కలెక్షన్లలతో కలిసి ఈ మూవీ రూ.90కోట్లు(గ్రాస్‌) దాటిందని తెలుస్తోంది.

35
`హరి హర వీరమల్లు` కలెక్షన్లపై జ్యోతికృష్ణ కామెంట్‌

అయితే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్లను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ముందు నుంచి కలెక్షన్ల ప్రకటనకు దూరంగా ఉన్నారు. Sacnilk, Bollymoviereviewz వంటి సైట్లు `హరి హర వీరమల్లు` కలెక్షన్లని వెల్లడిస్తున్నాయి. 

తాజాగా `హరి హర వీరమల్లు` కలెక్షన్లపై దర్శకుడు జ్యోతికృష్ణ స్పందించారు. తాము అధికారికంగా ఏం ప్రకటించినా ఫేక్‌ కలెక్షన్లు అంటారు, అందుకే ప్రకటించడం లేదు.

 ఎలాగూ కొన్ని సైట్లు తమకు వచ్చిన సమాచారంతో ప్రకటిస్తుంటాయి, కాబట్టి తాము వెల్లడించాలనుకోవడం లేదన్నారు. 

అయితే సినిమా పోస్టర్లతో సర్క్యూలేట్‌ అవుతున్నవన్నీ ఫేక్‌ కలెక్షన్లు అని, తాము అలాంటి పోస్టర్లు విడుదల చేయలేదని చెప్పారు. కలెక్షన్ల విషయంలో క్లారిటీ వచ్చాక ప్రకటిస్తామని తెలిపారు.

45
నెగటివ్ టాక్‌పై జ్యోతికృష్ణ రియాక్షన్‌

ఇదిలా ఉంటే సినిమాపై వస్తోన్న నెగటివ్‌ టాక్‌పై దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, కొందరు కావాలని నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని, 

సినిమా కథ, కథనం, మ్యూజిక్‌, ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్, డైరెక్షన్‌ వంటి వాటి విషయంలో ఎవరూ అభ్యంతరం తెలపలేదు, నెగటివ్‌గా రాయడం లేదు, కానీ కొన్ని అనుకోని విషయాలను మాత్రమే పట్టుకుని తప్పులు తీసుకున్నారు, అది కావాలని చేసే ప్రయత్నమే అని అన్నారు.

సినిమాకి మంచి స్పందన లభిస్తుందని, రెస్పాన్స్ విషయంలో తాము సంతృప్తిగానే ఉన్నామని, అయితే మొదటి కాపీలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని, ఆ తర్వాత వాటిని సరిచేశామని తెలిపారు దర్శకుడు.

55
`హరి హర వీరమల్లు` రిజల్ట్ పై పవన్‌ కళ్యాణ్‌ స్పందన

 `హరి హర వీరమల్లు` సినిమాకి వస్తోన్న స్పందనపై పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ, సినిమా ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించామని, చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పామని తెలిపారు.

 కలెక్షన్లు ఎంత వచ్చాయనేది తర్వాత విషయమని, దాన్ని తాను ఎప్పుడూ పట్టించుకోలేదని తెలిపారు. సినిమా తీసిన లక్ష్యం నెరవేరిందా లేదా అనేది ఇక్కడ ముఖ్యమన్నారు. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలిపారు పవన్‌ కళ్యాణ్‌. 

నెగటివ్‌ టాక్‌పై ఆయన రియాక్ట్ అవుతూ, మనపై నెగటివ్‌ కామెంట్ చేస్తున్నారంటే, మనం ఎంత ఎదిగామో గుర్తు చేస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని, అభిమానులు కూడా వాటికి బాధపడవద్దు అని, సాధ్యమైతే వారిని బలంగా ఎదుర్కోవాలని తెలపడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories