Happy Birthday review: 'హ్యాపీ బర్త్ డే' యూఎస్ ప్రీమియర్ షో టాక్.. ఫస్ట్ హాఫ్ సూపరే, కానీ

Published : Jul 08, 2022, 06:43 AM IST

'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హ్యాపీ బర్త్ డే'. ఫన్ అండ్ థ్రిల్లింగ్ రైడ్ గా ఈ చిత్రం ఉండబోతోంది. 

PREV
17
Happy Birthday review: 'హ్యాపీ బర్త్ డే' యూఎస్ ప్రీమియర్ షో టాక్.. ఫస్ట్ హాఫ్ సూపరే, కానీ

'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హ్యాపీ బర్త్ డే'. ఫన్ అండ్ థ్రిల్లింగ్ రైడ్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

 

27

దర్శకుడు ఈ చిత్రంలో గన్ కల్చర్ ని ఫన్నీగా చూపియించబోతున్నారు. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుండడంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది.. హైలైట్స్ ఏంటి అనే విషయాలు చూద్దాం. 

37

వెన్నెల కిషోర్ పొలిటీషియన్ పాత్రతో సినిమా ప్రారంభం అవుతుంది. వెన్నెల కిషోర్ గన్స్ పై చట్టాన్ని తీసుకువస్తారు. దీనితో గన్స్ ప్రజలందరికి సులువుగా లభిస్తాయి. ఆయా తర్వాత లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, కమెడియన్ సత్య పాత్రలు కూడా పరిచయం అవుతాయి. 

47

ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాల్లో మంచి ఫన్ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. కానీ ఆ సన్నివేశాలు హాస్యం కోసమే పెట్టారు అని భావించాలి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పై సరైన అంచనాలు సెట్ చేసే విధంగా ఉంటుంది. 

 

57

సోషల్ మీడియాలో కూడా హ్యాపీ బర్త్ డే చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. లావణ్య జైలు సన్నివేశాలని సాగదీశారు. లావణ్య లుక్స్, నటన మాత్రం బావున్నాయి. 

67

ఈ చిత్రంలో కమెడియన్ సత్య అద్భుతంగా కామెడీ పండించాడు. ఫస్ట్ హాఫ్ లో అతడి హాస్యమే హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే కథలో మీనింగ్ కొరవడిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో కామెడీ కూడా అంతగా పేలలేదు. 

77

ఓవరాల్ గా హ్యాపీ బర్త్ డే మూవీ యావరేజ్ స్టఫ్ తో నిండి ఉంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ, సెకండ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ మాత్రమే ఈ చిత్రాన్ని రక్షించాలి. ఓవరాల్ గా యావరేజ్ మూవీ అని ప్రేక్షకులు అంటున్నారు. 

 

click me!

Recommended Stories