హాన్సికా పెళ్ళికి ఎంత ఖర్చయ్యిందో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్..

First Published | Dec 8, 2022, 10:47 PM IST

సడెన్ గాపెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది హన్సికా మొత్వాని. కాని పెళ్ళి మాత్రం జామ్ జామ్  గా చేసుకుంది. ప్రస్తుతం ఆమె పెళ్ళి సోషల్ మీడియాలో.. హాట్ టాపిక్ అయ్యింది.  పెళ్ళి కోసం భారీగా ఖర్చు పెట్టిందట హన్సిక. ఎంత పెట్టిందంటే..? 
 

సడెన్ గా పెళ్లి చేసుకుని.. అందరికి షాక్ ఇచ్చింది హన్సిక మొత్వానీ.  సొహైల్ కతూరియాల ను  పెళ్లాడి గత కొద్దిరోజులుగా  వార్తల్లో నిలుస్తోంది హన్సికా మొత్వాని. హన్సికా పెళ్లికి  సబంధించిన కొన్ని విశేషాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. 

ముంబై ముద్దుగుమ్మ ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్‌నర్ సొహైల్ కతూరియాని డిసెంబర్ 4న పెళ్లాడింది. అది కూడా రాజస్థాన్‌లోని  రాయల్ ప్యాలెస్‌లో మ్యారేజ్ ఘనంగా చేసుకుంది.. కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్ .. కొంత మంది సినిమా వాళ్ళు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. 


 హాన్సికా పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి తమిళ స్టార్ హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి తో పాటు .. మరికొంత మంది స్టార్స్ మాత్రమే హాజరయ్యారు.  అంతే కాదు  కొంతమంది అనాధ బాల బాలికలను కూడా తన వివాహానికి ప్రత్యేకంగా ఆహ్వానించి మంచి మనసు చాటుకుంది హన్సిక..

హన్సిక తన పెళ్లికి సంబంధించిన ప్రతీ విషయంలో తగ్గేదే లే అన్నట్టు ఖర్చు చేసిందట.  తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనుండడంతో తన స్నేహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది.. ఆ పార్టీలో హన్సిక వేసుకున్న డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మెహందీ, హల్దీ వంటి ఫ్రీ వెడ్డింగ్  ఇలా అన్ని విషయాల్లో హన్సికా తన మార్క్ చూపించుకుంది. ఇంత జరిగింది. అసలు హన్సిక ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది అని చాలా మంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు  హన్సిక పెళ్లికైన ఖర్చు గురించి నెట్టింట వార్తలు వస్తున్నాయి. 

రాజస్థాన్‌లోని రాయల్ ప్యాలెస్‌ అద్దెతో మొదలు పెడితే.. భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టిందట హన్సిక.   తన పెళ్లి కోసం  దాదాపు 5 కోట్లకుపైగా ఖర్చు చేసిందట బ్యూటీ. ఈ వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో గట్టిగా వైరల్ అవుతుుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. హాన్సికా పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది అనేది నిజం. 

hansika health

బాలీవుడ్ లో బాలనటిగా ఎంటర్ అయ్యి.. అల్లు అర్జున్ దేశముదురు మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హన్సిక.  హాన్సికను హీరోయిన్ గా  పూరి జగన్నాథ్ పరిచయం చేశారు.  జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ , సిద్ధార్థ్, కళ్యాణ్ రామ్, నితిన్ లాంటి యంగ్ హీరోలందిరితోనూ ఆడిపాడింది బ్యూటీ. 

ఆతరువాత తెలుగులో అవకాశాలు లేక తమిళ ఇండస్ట్రీకి వలసపోయి.. అక్కడ ఇండస్ట్రీని ఏలింది. తమిళంలో హన్సికా ఫ్యాన్స్ ఆమెకు ఏకంగా గుడి కట్టి తమ అభిమానం చాటుకున్నారు.  రీసెంట్ గా 50 సినిమాలు పూర్తి చేసుకుంది హాస్సికా... ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. 

Latest Videos

click me!