హన్సికా నటించిన లేడీ ఓరియెంటెడ్ తెలుగు ఫిల్మ్ ‘మై నేమ్ ఇజ్ శృతి’కి మంచి రెస్పాన్సే దక్కుతోంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ఇక తెలుగులోనే ‘105 మినిట్స్’లోనూ నటిస్తోంది. అటు ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘మ్యాన్’ వంటి తమిళ చిత్రాలూ చేస్తోంది.