జాలీ లాంటి చీరలో హన్సికా మెరుపులు.. రెడ్ శారీలో యాపిల్ బ్యూటీ బ్యాక్ అందాలు అదుర్స్..

First Published | Nov 3, 2023, 12:27 PM IST

యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ చీరకట్టులో అదరగొడుతోంది. బ్యూటీఫుల్ శారీలో దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేస్తోంది. చీరలో అందాల విందు చేస్తూ మతులు పోగొడుతోంది. లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ గా ఉండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
 


స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) ప్రత్యేకమైన రోజుల్లో సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా  కర్వా చౌత్ ఫెస్టివల్ సందర్భంగా చీరకట్టులో మెరిసింది. ట్రెడిషనల్ గా దర్శనమిచ్చి లేటెస్ట్ ఫ్యాషన్ నూ పరిచయం చేసింది.

తాజాగా హన్సికా మోత్వానీ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆమె చీరకట్టుకూ అభిమానులతో పాటు నెటిజన్లూ మంత్రముగ్ధులు అవుతున్నారు. స్లిమ్ గా మారిన హన్సికా బ్యూటీఫుల్ శారీలో సొగసుల ప్రదర్శన చేయడంతో మరింతగా అట్రాక్ట్ చేసింది. 


హన్సికా రెడ్ శారీ ఆకట్టుకుంటోంది. జాలీ లాంటి కొంగు ఉన్న చీరలో మరింతగా గ్లామర్ మెరుపులు మెరిపించింది. మ్యాచింగ్ బ్లౌజ్ తో బ్యాక్ అందాలను ప్రదర్శించింది. ఫ్రంట్, బ్యాక్ ఫోజులిస్తూ ఫొటోషూట్ చేసింది. కుర్ర మనస్సును దోచుకునే స్టిల్స్ తో కట్టిపడేసింది. 

హన్సికా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా పండగవేళలో హిందూ సంప్రదాయాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రీసెంట్ కరక చతుర్థి సందర్భంగా.. భర్తతో కలిసి ఫెస్టివల్ జరుపుకుంది. ఆరోజు వివాహితులు భర్త మొహాన్ని తీగజాలి నుంచి చూడటం ఆచారం. హన్సికా కూడా ఫెస్టివల్ లో పాల్గొంది.
 

గతేడాది ఈ ముద్దుగుమ్మ తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ కతురియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సమయం ఉన్నప్పుడల్లా భర్తతో కలిసి టూర్లు, వెకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. ఇటు సినిమాలతోనూ బిజీగా మారింది.  

ప్రస్తుతం హన్సికా తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో 105 మినిట్స్, మై నేమ్ ఇజ్ శృతి, తమిళంలో రౌడీ బేబీ, గార్డియన్, గాంధరి, మ్యాన్ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. చివరిగా మహా అనే చిత్రంతో అలరించింది. 
 

Latest Videos

click me!