సింగిల్ గా వెళ్లి మింగిల్ అయ్యారు... బిగ్ బాస్ హౌస్లో రొమాన్స్ చేసిన ప్రేమ జంటలు వీరే!

Published : Nov 03, 2023, 12:26 PM IST

నాలుగు గోడల మధ్య అందమైన అమ్మాయిలు అబ్బాయిలు వారాల తరబడి కలిసి జీవిస్తే ప్రేమలు పుట్టకుండా ఉంటాయా? బిగ్ బాస్ హౌస్ ప్రేమకథలకు నెలవైంది. ఆ క్రేజీ ప్రేమ జంటలు ఏంటో చూద్దాం...   

PREV
18
సింగిల్ గా వెళ్లి మింగిల్ అయ్యారు... బిగ్ బాస్ హౌస్లో రొమాన్స్ చేసిన ప్రేమ జంటలు వీరే!
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ హౌస్లో ప్రేమ కథలు సాధారణమే. గత ఆరు సీజన్స్ తో పాటు లేటెస్ట్ సీజన్లో కూడా కొందరు కంటెస్టెంట్స్ ప్రేమికులుగా మారారు. వాటిలో కొన్ని ఘాడమైన ప్రేమకథలు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్లో ప్రేమ పక్షులుగా మారిన కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం... 

28
Bigg Boss Telugu 7

సీజన్ 3 విన్నర్ గా అవతరించాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ అడుగుపెట్టి టైటిల్ కొల్లగొట్టాడు. కంటెస్టెంట్ పునర్నవితో రాహుల్ ఎఫైర్ అప్పట్లో సెన్సేషన్. బిగ్ బాస్ తెలుగులో మొదటి ప్రేమజంటగా వీరు ఫేమస్ అయ్యారు. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. ప్రస్తుతం పునర్నవి లండన్ లో చదువుకుంటుంది. 

 

38
Bigg Boss Telugu 7

సీజన్ 4లో రెండు జంటలు ప్రముఖంగా ప్రాచుర్యం పొందాయి. అఖిల్ సార్థక్-మోనాల్ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. మోనాల్ అయితే త్యాగాలు కూడా చేసింది. అభిజీత్ ఎంత ట్రై చేసినా మోనాల్ మాత్రం అఖిల్ కి కనెక్ట్ అయ్యింది. అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలిచాడు. 

48
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 4లో అవతరించిన మరో ప్రేమ జంట అభిజిత్-హారిక. వీరు హౌస్లో ఉండగా బయట పేరెంట్స్ మధ్య పెళ్లి చర్చ కూడా వచ్చింది. ఫ్యాన్స్ ఇద్దరి పేరున ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. టైటిల్ కొట్టిన అభిజీత్ మాత్రం బయటకు వచ్చాక హారిక చెల్లితో సమానం అని ఝలక్ ఇచ్చాడు.

58
Bigg Boss Telugu 7

ఇక సీజన్ 5లో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు షణ్ముఖ్ జస్వంత్-సిరి హన్మంత్. స్నేహం మాటున బలమైన ప్రేమ బంధం నడిచింది. షణ్ముఖ్ చాలా పొసెసివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు. ముద్దులు, హగ్గులు కూడలి లాగించేశారు. ఇది నచ్చక షణ్ముఖ్ లవర్ దీప్తి బ్రేకప్ చెప్పింది. 

68
Bigg Boss Telugu 7

సింగర్ శ్రీరామ్, నటి హమీద మధ్య ప్రేమ కథ నడిచింది. హౌస్లో వీరిద్దరే కలిసి ఉండేవాళ్ళు. చక్కగా మాటామంతి చెప్పుకునేవారు. హమీద త్వరగా ఎలిమినేట్ కావడంతో వీరి బంధం అంతగా బలపడలేదు. శ్రీరామ్ మాత్రం హమీదాను మిస్ అయ్యాడు. 

 

78
Bigg Boss Telugu 7

సీజన్ 6లో ఆర్జే సూర్య-ఇనాయ సుల్తానా మధ్య పెద్ద గ్రంథమే నడిచింది. సూర్య నా క్రష్ అంటూ ఓపెన్ గా చెప్పేసింది ఇనయా. ఒకే కంచంలో తినడం, కలిసి తిరగడం చేశాడు. ఆట మీద దృష్టి పెట్టాలని నాగార్జున ఇద్దరినీ హెచ్చరించే వరకూ వ్యవహారం వెళ్ళింది. అనూహ్యంగా ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. దాంతో ఇనాయ దారుణంగా ఏడ్చింది. 

88
Bigg Boss Telugu 7


ఇక లేటెస్ట్ సీజన్ విషయానికి వస్తే.. గౌతమ్ శుభశ్రీకి లైన్ వేశాడు. ఆమె కూడా లైట్ గా సిగ్నల్ ఇచ్చింది. బంధం బలపడే లోపు శుభశ్రీ 4వ వారం ఎలిమినేట్ అయ్యింది. దాంతో ప్రేమకథకు ఫుల్ స్టాప్ పడింది. రతిక రీఎంట్రీ అనంతరం యావర్ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. నాగార్జున హెచ్చరించడంతో రతిక అతన్ని దూరం పెట్టాలని చూస్తుంది... ముందు ముందు వీరి వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.. 
 

Read more Photos on
click me!

Recommended Stories