Kingston movie OTT : జీవి ప్రకాష్ నటించిన 'కింగ్‌స్టన్' మూవీ త్వరలో ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వినపడుతున్నాయి. థియేటర్ దగ్గర డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారు, మిగతా వివరాలు ఏంటి
సంగీత దర్శకుడిగా హీరో గా మంచి ఫామ్ లో ఉన్న జివి ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) హీరోగా నటించి, నిర్మాతగానూ వ్యవహరించిన తాజా చిత్రం “కింగ్స్టన్” (Kingston). ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ బాగుండంతో సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకులలో రేకెత్తించింది.
ముఖ్యంగా “బ్యాచిలర్” అనంతరం జివి ప్రకాష్ – దివ్యభారతి (Divyabharathi) కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలయిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది.
ఈ క్రమంలో చాలా మంది థియేటర్ లో వద్దనుకుని ఓటిటిలో చూద్దామని ఫిక్సైపోయారు. ఈ క్రమంలో ఓటిటి డిటేల్స్ చూద్దాం.
23
GV Prakash Kingston movie OTT details? in telugu
కింగ్‌స్టన్ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సంస్థ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్‌లో రిలీజైన దాదాపు 5 వారాల తర్వాత ఏ సినిమానైనా ఓటీటీలో విడుదల చేయాల్సి ఉంది.
దీని ప్రకారం ఏప్రిల్ తొలి వారంలో కానీ , రెండవ వారంలో కానీ కింగ్‌స్టన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సినిమాకు ఓపినింగ్స్ బాగా రాలేదు, టాక్ బాగోలేదు, కాబట్టి థియేట్రికల్ రన్ త్వరగా ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ త్వరగా రావొచ్చు అంటోంది ట్రేడ్.
33
GV Prakash Kingston movie OTT details? in Telugu
చిత్రం కథేమిటంటే..సముద్రం ప్రక్కనే ఉన్న తోవత్తూర్ అనే గ్రామం జాలర్లు ఎవ్వరూ చేపల వేటకి వెళ్లలేక కూలి పనులు చేసుకుంటూ భయపడుతూ బ్రతుకుతుంటారు. చేపల వేటకు వెళ్లినవాళ్లు ఎవరూ ప్రాణాలతో తిరిగిరారు.
దానికి కారణం ఏంటి అనేదానికి చాలా పెద్ద కథ ఉంటుంది. అయితే.. కింగ్ (జివి ప్రకాష్ కుమార్) స్మగ్లింగ్ చేస్తూ ఆ డబ్బుతో స్నేహితులతో కలిసి మజా చేస్తూ ఉంటాడు. కానీ వాళ్లు స్మగ్లింగ్ చేస్తుంది నీటి జలగలు కావని డ్రగ్స్ అని ఓ పెయిన్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ ద్వారా తెలుసుకుంటాడు.
ఇదంతా చేస్తుంది ఎవరు? అసలు తోవత్తూర్ ప్రజలు సముద్రంలోకి ఎందుకు వెళ్లలేరు? ఈ శాపాన్ని కింగ్ ఎలా జయించాడు? అనేది “కింగ్స్టన్” (Kingston) కథాంశం.