Chhaava : విక్కీ కౌశల్, రష్మిక నటించిన 'ఛావా' మూవీ తెలుగులో విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది.
Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu
Chhaava : విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) హిందీలో ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని సంపాదించుని దూసుకుపోతోంది. 'ఛావా' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.630 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజైన మూడు వారాల తర్వాత (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. మరి ఇక్కడ ఈ చిత్రానికి ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి. హిందీ స్దాయి కాకపోయినా అందులో సగం అయినా రాబట్టే పరిస్దితులు ఉన్నాయా చూద్దాం.
23
Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'ఛావా' చిత్రం తెలుగు ప్రేక్షకులుకు కూడా బాగానే నచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల్లో 'ఛావా' చిత్రం రూ.3.03 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఓ డబ్బింగ్ సినిమాకు ఫస్ట్ డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డుగా భావించబడుతోంది. ఓ హిందీ డబ్బింగ్ సినిమాకు ఈ స్దాయి కలెక్షన్స్ రావటం మాటలు కాదంటున్నారు. ఈ విధంగా, 'ఛావా' చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని, బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది.
33
Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu
‘ఛావా’ (Chhaava) చిత్రానికి తెలుగులో రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది చాలా ఈజి అంటున్నారు. వీకెండ్ అయ్యేసరికి పూర్తి రికవరీ ఉంటుందంటున్నారు.
ఇక ఛావా విషయానికొస్తే.. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. శంభాజీ పాత్రలో విక్కీ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా..ఔరంగాజేబు పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.